Begin typing your search above and press return to search.

పవన్ OG.. తెలుగు రాష్ట్రాల ప్రీమియర్స్ సంగతేంటి?

ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయనున్నారు. అమెరికాలో ముందు రోజు ప్రీమియర్స్ పడనున్నాయి.

By:  M Prashanth   |   11 Sept 2025 3:28 PM IST
పవన్ OG.. తెలుగు రాష్ట్రాల ప్రీమియర్స్ సంగతేంటి?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఓజీ మూవీ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసిన మేకర్స్.. ఇప్పుడు రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయనున్నారు. అమెరికాలో ముందు రోజు ప్రీమియర్స్ పడనున్నాయి.

అందుకు గాను మేకర్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ షోకు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ను మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అవ్వగా.. హాట్ కేకుల్లా టికెట్స్ సేల్ అవుతున్నాయి. టికెట్స్ పెట్టిన నిమిషాల్లోనే క్లోజ్ అయిపోతున్నాయి. రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ బుకింగ్స్ తోనే ఓజీ రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.

అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ సంగతేంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఓజీ మేకర్స్.. ప్రీమియర్స్ కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను విన్నవించుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ 24వ తేదీన రాత్రి 9:00 గంటలకు ప్రీమియర్స్ షోస్ వేసేందుకు అనుమతి కోరనున్నారట.

అలా నైజాం అంతటా ప్రీమియర్స్ షోస్ ను మేకర్స్ వేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పద్ధతి ఫాలో అవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి. సెప్టెంబర్ 24-25 తేదీల్లో సవరించిన రేట్ల కోసం కూడా సర్కార్లను అడగనున్నారట.

దీంతో మరికొద్ది రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు జీవోలు విడుదల చేయనున్నాయన్నమాట. అయితే నైజాం తొలి టికెట్‌ ను ఇప్పటికే వేలం వేశారు. టీమ్‌ పవన్‌ కల్యాణ్‌ నార్త్‌ అమెరికా బృందం రూ.5లక్షలకు సొంతం చేసుకుంది. ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ప్రకటించింది. ఎమ్మెల్సీ నాగబాబును కలిసి డీడీ అందించింది.

కాగా ఓజీ విషయానికొస్తే.. గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజీత్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పవన్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుండగా.. ఆయన సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, సిరి లెళ్ల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నారు.