పవన్ vs బాలయ్య.. ఆ పదవి కోసం పోటీ?
అయితే పవన్ రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం నిర్మించారు.
By: M Prashanth | 3 Sept 2025 11:11 AM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పవన్.. ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. బాధ్యతతో ఆయన ఆ పదవిని నిర్వర్తిస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలో పవన్ మాటకు తిరుగు లేదు అన్నది నిజమైన మాట. ఆయన మాటకు సీఎం, మంత్రులు కూడా మద్దతుగా ఉంటారు.
అయితే పవన్ రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో నిర్మాత రత్నంపై పవన్ ప్రశంసలు కురిపించారు. ఆయన మంచి ప్రొడ్యూసర్ అని కొనియాడారు. ఈ క్రమంలోనే అంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ ఛైర్మన్ గా నిర్మాత ఎ.ఎం.రత్నం పేరును ప్రతిపాదించినట్లు ప్రీ రిలీజ్ వేడుక స్టేజ్ పై చెప్పారు.
ఇక పవన్ ప్రతిపాదించారంటే దానికి తిరుగు లేదని.. పక్కా రత్నం ఎఫ్‌డీసీ ఛైర్మన్ అవుతారని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఆయన ఎంపిక లాంఛనమే అని కూడా ప్రచారం సాగింది. అయితే తాజాగా ఈ వ్యవహారంలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ప్రముఖ హీరో, తెలుగుదేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రేస్ లోకి మరో నిర్మాత పేరును తీసుకొచ్చారు.
బాలకృష్ణ ఈ పదవికి మరొకరి పేరుని ప్రతిపాదించారని సమాచారం అందుతోంది. అయితే బాలయ్య ప్రతిపాదించింది కూడా సమర్థుడైన వ్యక్తినే అని అంటున్నారు. కానీ ఆ నిర్మాత పేరు మాత్రం తెరపైకి రాలేదు. మరి ఈ పదవికి ప్రభుత్వం ఎవరిని ఫైనల్ చేస్తుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఆ పదవి ఎరినికి వరిస్తుందో.
కాగా, రత్నం నిర్మించిన హరిహర వీరమల్లు జులై 24న గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను ప్రారంభించగా.. జ్యోతి కృష్ణ ముగించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ పాన్ఇండియా భాషల్లో తెరకెక్కింది. రెండు పార్ట్ లుగా ఈ సినిమా రానుంది. ఇందులో భాగంగానే తొలి పార్ట్ రిలీజైంది. వచ్చే ఏఢాది రెండో భాగం వచ్చే అవకాశం ఉంది.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ పీరియాడికల్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటులు అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనూపమ్ కేర్ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
