Begin typing your search above and press return to search.

నటుడు పవన్ సింగ్ కి Y+ భద్రత.. అండగా ఎంతమంది ఉంటారంటే?

గత కొన్ని రోజులుగా గమనిస్తున్న సందర్భాలను బట్టి చూస్తే.. సెలబ్రిటీలకు ఎక్కువగా ప్రాణహాని ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

By:  Madhu Reddy   |   8 Oct 2025 3:53 PM IST
నటుడు పవన్ సింగ్ కి Y+ భద్రత.. అండగా ఎంతమంది ఉంటారంటే?
X

గత కొన్ని రోజులుగా గమనిస్తున్న సందర్భాలను బట్టి చూస్తే.. సెలబ్రిటీలకు ఎక్కువగా ప్రాణహాని ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది దుండగులు సెలబ్రిటీలను డబ్బు పేరిట బెదిరిస్తూ.. వారికి కంటిమీద కనుక లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మొదలుకొని ఇప్పుడు ప్రముఖ నటుడు పవన్ సింగ్ వరకు చాలామంది ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం వీరికి Y+ కేటగిరి భద్రతను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ నటుడు పవన్ సింగ్ కి కూడా కేంద్ర ప్రభుత్వం Y+ సెక్యూరిటీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ వివాదాస్పద భోజ్ పురి నటుడు పవన్ సింగ్ కి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం Y+ కేటగిరి భద్రతను కేటాయించింది. ముఖ్యంగా ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటలిజెన్స్ బ్యూరో (IB) నివేదికల ఆధారంగా ఈ భద్రత కల్పించినట్లు సమాచారం. ఇకపోతే ఈ కేటగిరీ కింద CRPF కి చెందిన సుమారు 8 నుంచీ 11 మంది సాయుధ కమాండోలు, వ్యక్తిగత భద్రత అధికారులు 24 గంటలు పవన్ సింగ్ కు రక్షణగా ఉంటారు. ముఖ్యంగా వ్యక్తిగత భద్రత అధికారులు, కేంద్ర దళాల కమాండోలు ఆయనకు భద్రత కలిగిస్తారు. ఇంట్లో ఉన్నా.. కార్యక్రమంలో ఉన్నా లేదా ప్రయాణిస్తున్నా.. ఎల్లప్పుడూ ఆయన చుట్టూనే వీరంతా ఉంటారు. ఈ భద్రత ఏర్పాటు ఉద్దేశం పవన్ సింగ్ ను ఏవైనా సంభావ్య ముప్పుల నుండి రక్షించడమే ప్రధాన లక్ష్యం.

ఇకపోతే బీజేపీ నాయకుడిగా, భోజ్ పురి సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ సింగ్.. గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజకీయ కార్యకలాపాలతో పాటు వ్యక్తిగత వివాదం లో కూడా ఈయన చర్చనీయాంశంగా మారారు. దీనికి తోడు ఇటీవల ఆయన భార్య జ్యోతి సింగ్ కూడా ఈయనపై ఆరోపణలు చేసింది. ఇటీవలే ఈయన లక్నో అపార్ట్మెంట్ ను కూడా ఆమె సందర్శించి తీవ్ర విమర్శలు గుప్పించింది.

ముఖ్యంగా తాను మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని , ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నానని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు పవన్ సింగ్.

అక్టోబర్ 5వ తేదీన హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ అగ్ర నాయకులను కలిసి తనకు భద్రత కల్పించాలని కోరారు. ఇటీవల తిరిగి బిజెపిలో చేరారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఆయనను ఆరా లేదా కరకట్ నుండి పోటీకి నిలపవచ్చని సమాచారం.