గంభీర.. రెండో రోజు ఎలా ఉన్నాడు?
పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ వదలకపోయినా, పబ్లిసిటీ కూడా చేయకపోయినా.. రిలీజ్ ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్‌గా లేకపోయినా.. ఎక్కడ లేని హైప్ వచ్చిందీ చిత్రానికి
By: Garuda Media | 26 Sept 2025 8:50 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత హైప్‌తో వచ్చిన చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి. పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ వదలకపోయినా, పబ్లిసిటీ కూడా చేయకపోయినా.. రిలీజ్ ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్‌గా లేకపోయినా.. ఎక్కడ లేని హైప్ వచ్చిందీ చిత్రానికి. రిలీజ్‌కు ముందు రోజు ‘ఓజీ’కి పెయిడ్ ప్రిమియర్స్ వేస్తే.. రెస్పాన్స్ మామూలుగా లేదు.
మొత్తం ఇండియాలో పెయిడ్ ప్రిమియర్స్‌తో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘ఓజీ’ నిలిచింది. తొలి రోజు కూడా సినిమా ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది. ఐతే ‘ఓజీ’కి సమీక్షలు, టాక్ అయితే మరీ గొప్పగా ఏమీ లేదు. ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అనిపించినా.. సామాన్య ప్రేక్షకులు యావరేజ్ అనే అన్నారు. ఈ టాక్‌తో రెండో రోజు నుంచి సినిమా ఏ మేర సర్వైవ్ అవుతుందా అని చూశారు ట్రేడ్ పండిట్లు. ఐతే ‘ఓజీ’ శుక్రవారం బలంగానే నిలబడ్డ సంకేతాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ‘ఓజీ’కి శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. మార్నింగ్ షోలతో పోలిస్తే మ్యాట్నీలకు స్పందన మరింత మెరుగ్గా ఉంది. ఇక ఫస్ట్ షోలకు అయితే సోల్డ్ ఔట్‌లు చూడొచ్చు. మెజారిటీ షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. వీకెండ్ కాబట్టి శని, ఆదివారాల గురించి టెన్షన్ అవసరం లేదు. మంచి ఆక్యుపెన్సీలు ఉంటాయి.
సినిమాకు యావరేజ్ టాక్ ఉన్న నేపథ్యంలో రెండో రోజు వసూళ్లలో మేజర్ డ్రాప్ ఏమైనా ఉంటుందా అన్న సందేహాలు కలిగాయి. కానీ కంగారేమీ లేదు. డ్రాప్ ఉన్నప్పటికీ అది ఇబ్బందికర స్థాయిలో అయితే లేదన్నది స్పష్టం. ఓవరాల్‌గా చూస్తే ‘ఓజీ’ హిట్ అనిపించుకోవడం ఖాయం. మరి బ్లాక్‌బస్టర్ రేంజికి వెళ్తుందా లేదా అన్నది చూడాలి. బ్రేక్ ఈవెన్ కావాలంటే ‘ఓజీ’ రూ.400 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
