Begin typing your search above and press return to search.

ఉస్తాద్ భగత్ సింగ్.. నెగిటివ్ వైబ్ కు హరీష్ నో ఛాన్స్!

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. ఇప్పటికే సైన్ చేసిన సినిమాలు పూర్తి చేస్తున్నారు.

By:  M Prashanth   |   5 Aug 2025 4:39 PM IST
ఉస్తాద్ భగత్ సింగ్.. నెగిటివ్ వైబ్ కు హరీష్ నో ఛాన్స్!
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత వారి కాంబో రిపీట్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. ఇప్పటికే సైన్ చేసిన సినిమాలు పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు కంప్లీట్ అయ్యి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్ గా విడుదల కానుంది.

ప్రస్తుతం ఉస్తాద్ షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్. రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైన పాట షూటింగ్ తాజాగా ముగిసింది. దీంతో సినిమాకు సంబంధించిన కీలక దశ పూర్తయినట్లే! ఆ సందర్భంగా పవన్ తో దిగిన పిక్ ను హరీష్ షేర్ చేశారు. అందులో పవర్ స్టార్ యాక్షన్ మోడ్ లో కనిపించారు. తన గెటప్ తో అందరినీ ఫిదా చేశారు.

మొత్తానికి హరీష్ శంకర్ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. అప్పట్లో సినిమా రద్దు అయిందని వార్తలు వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత షూటింగ్ రీస్టార్ట్ అయిన రోజే రివీల్ చేశారు. స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. వివిధ విషయాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా గొడవ జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఫిలిం ఫెడరేషన్ బంద్ కు పిలుపునివ్వగా.. కార్మికులు ఎవరూ షూటింగ్స్ కు వెళ్లడం లేదు. దీంతో ముంబై, చెన్నై నుంచి కార్మికులను తెప్పించుకున్నారని, అందుకే అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద వాగ్వాదం జరిగినట్లు టాక్ వినిపించింది. అదే సమయంలో ఇప్పుడు ఎలాంటి నెగిటివ్ వైబ్ కు తావివ్వకుండా షూటింగ్ అప్డేట్ ను ఇచ్చారు హరీష్ శంకర్.

మరోవైపు వీరమల్లు అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. ఓజీపై మాత్రం పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో ఓజీ హైప్ తో నిలదొక్కుకోవాలంటే గ్యాప్ లేకుండా ఏదో ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు హరీష్ శంకర్ కమ్ మేకర్స్. 2026లో సినిమా గ్రాండ్ గా విడుదలవ్వనుండగా.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.