బన్నీ మాట కోసం ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సందడి నెలకొంది. అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు.
By: M Prashanth | 8 April 2026 4:10 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సందడి నెలకొంది. అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా బన్నీ బర్త్ డే విషెస్ తో టైమ్ లైన్ నిండిపోగా, ఆయన ఫ్యాన్స్ పుట్టిన రోజు వేడుకను పండుగలా జరుపుకుంటున్నారు. అయితే అభిమాన హీరోల బర్త్ డే ఫ్యాన్స్ కు పండుగ వంటిదే.
అదే సమయంలో అల్లు అర్జున్ కూడా తనకు వచ్చిన శుభాకాంక్షలకు స్పందిస్తూ, పలువురు సెలబ్రిటీలకు రిప్లై ఇస్తున్నారు. ఆయన ఒక్కో పోస్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు బిజీగా ఉన్నారని చెప్పాలి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన బర్త్ డే విషెస్ కు అల్లు అర్జున్ ఎలా రెస్పాండ్ అవుతారన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
పవన్ కళ్యాణ్ తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ద్వారా అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలిపారు. "నటుడు అల్లు అర్జున్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరాల్లో ఆయనకు మరింత విజయాలు, ఎన్నో మైలురాళ్లు దక్కాలని కోరుకుంటున్నాను" అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విషెస్.. నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ నుంచి పవన్ విషెస్ కు రెస్పాన్స్ రాలేదు. దీంతో పవన్ అభిమానులు, సినీ ప్రియులు బన్నీ రిప్లై కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరి మధ్య సంబంధాలపై వచ్చిన వార్తల నేపథ్యంలో ఆ రిప్లైకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. గత ఏడాది సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.
"హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు" అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ పోస్టుతో పాటు పవన్ తో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు. అప్పట్లో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతున్న సమయంలో బన్నీ చేసిన ఆ ట్వీట్ అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా పవన్ ను పవర్ స్టార్ అని ప్రత్యేకంగా మెన్షన్ చేయడం విశేషంగా మారింది.
ఇప్పుడూ అదే తరహాలో బన్నీ స్పందిస్తారా? లేక మరింత ప్రత్యేకంగా రిప్లై ఇస్తారా? అన్న ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో ఆ అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి, అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పిన విషెస్ ఇప్పుడు ఇద్దరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇక బన్నీ నుంచి వచ్చే రిప్లై కోసం అందరూ ఎదురు చూస్తుండగా.. అది వచ్చిన తర్వాత ఆ చర్చ మరింత పెరిగే అవకాశం ఉంది.
