అన్నయ్య, చిన్న అన్నయ్య.. మెగా బ్రదర్స్ కోసం పవన్ భార్య ఇలా..
ప్రస్తుతం అన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ ఆమె వ్యాఖ్యలను అభినందిస్తూ, ఫ్యామిలీ వాల్యూస్ కు రిఫ్లెక్ట్ చేసేలా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.
By: M Prashanth | 26 March 2026 12:56 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో అడుగుపెట్టిన ఆమెకు మెగా అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అకౌంట్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే రెండు లక్షలకు పైగా ఫాలోవర్స్ చేరడం విశేషం. ఆమె పెట్టిన పోస్టులు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఆమె చేసిన ఒక ఎమోషనల్ పోస్టు చర్చనీయాంశమైంది. తన భర్త కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని ఎంతో హార్ట్ ఫుల్ గా వివరించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను కదిలించాయి. వారితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, తన మనసులోని భావాలను పంచుకున్నారు అన్నా.
"దాదాపు పదిహేనేళ్ల క్రితం ఈ కుటుంబంలోకి వచ్చినప్పుడు ఎలా కలిసిపోవాలో తెలియలేదు. ఎవరికేమని పిలవాలో కూడా అర్థం కాలేదు. అందుకే నా భర్తను అనుసరించి అన్నయ్య, చిన్న అన్నయ్య అని పిలవడం ప్రారంభించాను. మొదట అది మాట మాత్రమే. కానీ మెల్లగా అది నా మనసులోని భావంగా మారింది. నాకు సోదరుడు లేకపోయినా, జీవితం సైలెంట్ గా నాకు ఇద్దరిని ఇచ్చింది" అంటూ అన్నా తన పోస్టులో పేర్కొన్నారు
ప్రస్తుతం అన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ ఆమె వ్యాఖ్యలను అభినందిస్తూ, ఫ్యామిలీ వాల్యూస్ కు రిఫ్లెక్ట్ చేసేలా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇన్ స్టాగ్రామ్ లోకి వచ్చిన తర్వాత ఆమె చేసిన మొదటి పోస్టు సాధారణ పరిచయానికి చెందినదే. తన గురించి, తన ప్రయాణం గురించి వివరించారు.
రెండో పోస్టులో మాత్రం పవన్ తో కలిసి ఉన్న ఫోటోను పంచుకోవడం ద్వారా మెగా అభిమానులను ఆకట్టుకున్నారు. అలాగే తన బయోలో రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్ అని పేర్కొనడం గమనార్హం. రష్యాలో జన్మించిన ఆమె, ఇండియన్ ఫ్యామిలీలోకి కోడలిగా వచ్చిన తర్వాత రెండు సంస్కృతులను ఫాలో అవుతూ జీవిస్తున్నానని వెల్లడించారు. ప్రేమ, కృతజ్ఞతతో జీవిస్తూ, ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నానని చెప్పారు.
చాలా కాలంగా సోషల్ మీడియాలోకి రావాలని అనుకున్నానని, అయితే ఇప్పుడు సరైన సమయం అనిపించిందని తెలిపారు. మెగాస్టార్ ఆశీస్సులు, తన భర్త పవన్ కళ్యాణ్ మద్దతుతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని పేర్కొన్నారు. అయితే పవన్ సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ అభిమానులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం అరుదు. ఈ నేపథ్యంలో అన్నా ఎంట్రీ అభిమానులకు మరింత ఆనందం కలిగించిందని చెప్పాలి.
ఆమె ద్వారా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు అభిమానులకు చేరుకునే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అకౌంట్ కు ఫాలోవర్స్ స్పీడ్ గా పెరుగుతున్నారు. రాబోయే రోజుల్లో ఆమె మరింత యాక్టివ్ గా ఉంటారని, ఫాలోవర్ల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరిగే అవకాశముందని అంతా అంచనా వేస్తున్నారు. మొత్తంగా అన్నా సోషల్ మీడియా ఎంట్రీ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు.
