Begin typing your search above and press return to search.

చరణ్, పవన్.. న్యూ ఇయర్ కు సౌండ్ చేసేదెవరు?

అయితే న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   11 Nov 2025 9:41 PM IST
చరణ్, పవన్.. న్యూ ఇయర్ కు సౌండ్ చేసేదెవరు?
X

ప్రస్తుతం మెగా హీరోలంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది.. వారంతా కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. బాక్సాఫీస్ వద్ద గట్టి హిట్స్ ను అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ముందుగా మెగాస్టార్ చిరంజీవి.. మన శంకర వరప్రసాద్ గారు మూవీతో సంక్రాంతికి రానున్నారు.

ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్దితో సందడి చేయనుండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో థియేటర్స్ లోకి రానున్నారు. అయితే చరణ్ పెద్ది మూవీ రిలీజ్ డేట్ ఇప్పటికే ఖరారు అవ్వగా.. ఇంకా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అదే సమయంలో ఇప్పుడు వారిద్దరు మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్.. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. త్వరలో సాంగ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి.

అయితే న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలో ఆ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారట. అదే సమయంలో పెద్ది మూవీ నుంచి సెకెండ్ సింగిల్ కూడా అప్పుడే విడుదలవుతుందని కొన్ని గంటల్లో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

దానిపై మేకర్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వకపోయినా.. వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల పెద్ది మేకర్స్.. ఫస్ట్ సింగిల్ చికిరి సాంగ్ రిలీజ్ చేయగా.. మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి.. పాతవి బ్రేక్ కూడా అయ్యాయి. దీంతో ఇప్పుడు సెకెండ్ సాంగ్ రిలీజ్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే బాబాయ్, అబ్బాయ్ చిత్రాల నుంచి సాంగ్స్ ఒకేసారి రిలీజ్ అయితే ఫ్యాన్స్ కు పండగే అయినప్పటికీ.. అది మ్యూజిక్ క్లాష్ కు దారితీస్తుంది. కంపేరిజన్లు వస్తాయి. రీచ్ విషయంలో కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రెండు మూవీల మేకర్స్ ఒకేసారి సాంగ్స్ ను రిలీజ్ చేసేందుకు వెనకడుగు వేయడం కచ్చితం. మరి న్యూ ఇయర్ కానుకగా పవన్, చరణ్ లో ఎవరు సందడి చేస్తారో చూడాలి.