Begin typing your search above and press return to search.

ఉస్తాద్ భగత్ సింగ్: తెలంగాణలో అలా.. ఆంధ్రాలో ఇలా.. ఎందుకు?

గతంలో జగన్ ప్రభుత్వంలో పవన్ తో సహా కొందరు అగ్రహీరోల సినిమాలు కారుచౌక ధరకు ప్రదర్శించేలా అప్పటి ప్రభుత్వ విధానాలు ఉండేవి.

By:  Garuda Media   |   18 March 2026 9:15 AM IST
ఉస్తాద్ భగత్ సింగ్: తెలంగాణలో అలా.. ఆంధ్రాలో ఇలా.. ఎందుకు?
X

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదల అవుతుందంటేనే.. అదో పండుగలా ఉంటుంది. అందునా.. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది పండుగతో పాటు.. ముస్లింలకు పెద్ద పండుగ రంజాన్ రెండింటిని కవర్ చేసేలా విడుదలవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదల ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు డబుల్ పండుగ్గా మారింది. షెడ్యూల్ ప్రకారం కాకుండా ఒక వారం ముందే విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించిన టికెట్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక పెద్ద తెలుగు సినిమా విడుదల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరల పెంపు వ్యవహారం పెద్ద వ్యత్యాసం లేకుండా ఉండే పరిస్థితి.

గతంలో జగన్ ప్రభుత్వంలో పవన్ తో సహా కొందరు అగ్రహీరోల సినిమాలు కారుచౌక ధరకు ప్రదర్శించేలా అప్పటి ప్రభుత్వ విధానాలు ఉండేవి. ఆ తీరు విమర్శలకు తావిచ్చేది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలకు సంబంధించి చిత్ర నిర్మాత మైత్రి మైవీస్ వారు అనుసరిస్తున్న తీరును తప్పు పడుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో టికెట్ల ధరలు భారీగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరు కారణంగా ధరల్లో హెచ్చుతగ్గులు ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదలలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా నిర్మాతలు అనుసరిస్తున్న విధానం విమర్శలకు తావిచ్చింది.

ఈ మూవీ టికెట్లను పెంచుకోవటానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వెసులుబాటు ఉంది. తెలంగాణ విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ తెలంగాణలో ఉన్న తొంభై రోజుల నిబంధనను సవాలు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించి.. విజయం సాధించటం తెలిసిందే. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సెంటర్ లో విపరీతంగా టికెట్ల ధరల్ని పెంచితే దాని ప్రభావం సినిమా ఉంటుదన్న ఉద్దేశంతో నైజామ్ ఏరియాలో మల్టీప్లెక్స్ టికెట్ ను రూ.295గా.. సింగిల్ స్క్రీన్ టికెట్ ను రూ.175గా డిసైడ్ చేశారు.

గతంలో అగ్ర హీరోల సినిమాలకు వందశాతం టికెట్ల ధరల్ని పెంచేసేవారు. దీంతో.. మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.250 ఉన్న టికెట్ల ధరల్ని రూ.500 లకు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. ప్రేక్షకులు పెద్దగా ఇబ్బంది పడకుండా అందరికి అందుబాటులో ఉండేలా మల్టీఫ్లెక్స్ లో రూ.95, సింగిల్ స్క్రీన్ లో రూ.25 పెంచేలా డిసైడ్ చేశారు. దీనికి తోడు ఇటీవలే మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ తర్వాత.. ఈ సినిమా మీద హైక్ మరింత పెరిగేలా చేసింది. దీనికి తోడు టికెట్ల ధరలు అదుబాటులోకి ఉండటం మరింత ఊపును పెంచేలా చేసిందన్న మాట వినిపిస్తోంది. దీంతో తెలంగాణలో మల్టీఫ్లెక్స్ లో రూ.295, సింగిల్ స్క్రీన్ లో రూ.175గా డిసైడ్ చేశారు.

ఇదిలా ఉంటే ఏపీ విషయానికి వస్తే.. మల్టీఫ్లెక్సు లో రూ.125, సింగిల్ స్క్రీన్ కు రూ.100 వరకు పెంచుకునేందుకు ీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీలోని మల్టీఫ్లెక్సులో రూ.200 టికెట్ల ఉంటే.. తాజా పెంపుతో రూ.325 అవుతుంది. అదే విధంగా సింగిల్ థియేటర్ లో రూ.100 పెంచటం ద్వారా టికెట్ ధర రూ.200లకు పెరిగింది. ఒకవేళ.. అందరికి అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకోవాలంటే.. రెండుచోట్ల ఒకేలాంటి ధరల్ని డిసైడ్ చేయొచ్చు. లేదంటే.. ఏపీ వరకు ఒక పాలసీ.. తెలంగాణ వరకు మరో పాలసీని అమలు చేసినా.. టికెట్ల పెంపు రెండు చోట్ల ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. అందుకు భిన్నంగా వేర్వేరు ధరలు ఉండటం.. తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రాలో టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.