ఉస్తాద్ భగత్ సింగ్.. మళ్ళీ బిజీబిజీగా పవన్
ఈ రెండు సినిమాలపైనా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ పవన్ కాంబినేషన్‌కి “గబ్బర్ సింగ్” విజయంతో ఉన్న క్రేజ్ వేరే స్థాయిలో ఉంది.
By: M Prashanth | 8 Sept 2025 12:59 AM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సుజీత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న OG, మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్. ఈ రెండు సినిమాలపైనా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ పవన్ కాంబినేషన్‌కి “గబ్బర్ సింగ్” విజయంతో ఉన్న క్రేజ్ వేరే స్థాయిలో ఉంది.
ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ షూట్‌కు సంబంధించిన కొన్ని షెడ్యూల్స్ పూర్తి కాగా, తాజా అప్‌డేట్ ప్రకారం ఈరోజు హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందులో పవన్ కళ్యాణ్ జాయిన్ కావడంతో ఫ్యాన్స్‌లో హైప్ మరింత పెరిగింది. ఈ షెడ్యూల్‌లో పవన్‌తోపాటు హీరోయిన్ రాశి ఖన్నా పాల్గొననున్నారు.
వీరిద్దరిపై డైనమిక్ సాంగ్‌ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్న ఈ సాంగ్ కోసం ప్రత్యేక సెట్స్ వేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ కొన్ని రోజులు కొనసాగనుంది. ఇందులో సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు కూడా షూట్ చేయనున్నారని ఇండస్ట్రీ టాక్. రాశి ఖన్నా పవన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకి కొత్త ఫీల్ ఇస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్‌లో మరో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండటం కూడా సినిమాపై అదనపు ఆకర్షణగా మారింది. ఫ్యాన్స్ అయితే ఈ లేటెస్ట్ షెడ్యూల్ అప్‌డేట్‌తో ఎక్సైట్మెంట్‌లో ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ మాస్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే సౌండ్‌ట్రాక్‌పై అంచనాలు పెరిగాయి.
త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. DSP హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మాస్ బీట్స్ హిట్ ఫార్ములా అని టాక్ ఉంది. మొత్తానికి, పవన్ కళ్యాణ్ సాంగ్ షూట్‌లో జాయిన్ అవ్వడం సినిమాకు కొత్త ఊపునిచ్చింది. షూటింగ్ ప్రోగ్రెస్ వేగంగా జరుగుతుండగా, ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు సాంగ్ టీజర్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో ప్రమోషన్లు స్టార్ట్ చేసి, 2026లో సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ చేస్తున్నారు.
