టార్గెట్ ఫిక్స్ చేసిన హరీష్ శంకర్
రీసెంట్ గా వచ్చిన ఓజి సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ ను అందుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Oct 2025 1:00 PM ISTరీసెంట్ గా వచ్చిన ఓజి సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ ను అందుకున్నారు. ఈ మూవీతో పవన్ ఫ్యాన్స్ ఆకలి కూడా తీరింది. వారెంతో కాలంగా వెయిట్ చేస్తున్నది ఓజి లాంటి సినిమా కోసమే. ఓ వైపు రాజకీయాల్లో ఉంటూ, మరోవైపు సినిమాలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి పవన్ ఎక్కువగా రీమేక్ సినిమాలే చేయడం వల్ల ఇలాంటి సినిమాలకు ఛాన్స్ లేకుండా పోయింది.
ఓజితో బ్లాక్ బస్టర్ కొట్టిన పవన్
అందుకే సుజిత్ దర్శకత్వంలో పవన్ ఓ కమర్షియల్ సినిమా చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మొత్తానికి ఓజితో పవన్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి చూపు ఉస్తాద్ భగత్‌సింగ్ పైకి మళ్లింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
గబ్బర్ సింగ్ హిట్ తర్వాత మరోసారి హరీష్‌తో..
ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కమర్షియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. పైగా పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్‌ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో గతంలో గబ్బర్ సింగ్ అనే సినిమా రాగా, ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే వీరి కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌పై మంచి క్రేజ్ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది.
75% షూటింగ్ పూర్తి
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇప్పటికే 75% పూర్తైందని తెలుస్తోంది. ఆల్రెడీ పవన్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ కాగా, బ్యాలెన్స్ షూటింగ్ ను మిగిలిన ఆర్టిస్టులతో ఫినిష్ చేస్తున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తం షూటింగ్ ను నవంబర్ నాటికి పూర్తి చేయాలని హరీష్ టార్గెట్ గా పెట్టుకున్నారట. అందులో భాగంగానే ఇక షూటింగ్ ను పరుగులు పెట్టించాలని డిసైడయ్యారట హరీష్.
మరో గబ్బర్ సింగ్ అవుతుందా?
ఎలాగూ పవన్ పోర్షన్ షూటింగ్ అయిపోయింది కాబట్టి అనుకున్న టైమ్ కు షూటింగ్ పూర్తి చేసేయొచ్చు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, షూటింగ్ పూర్తయ్యాకే అన్నీ చూసుకుని మంచి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తామని ఆల్రెడీ నిర్మాతలు చెప్పిన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత పవన్- హరీష్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా మరో గబ్బర్ సింగ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
