Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యాన్స్ కి శుభవార్త.. త్వరలో కిక్ ఇచ్చే న్యూస్!

సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచే సినిమాలలో గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది సెలబ్రిటీలు.. రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టి చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   5 Oct 2025 12:11 PM IST
పవన్ ఫ్యాన్స్ కి శుభవార్త.. త్వరలో కిక్ ఇచ్చే న్యూస్!
X

సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచే సినిమాలలో గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది సెలబ్రిటీలు.. రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టి చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. అయితే అలా వచ్చిన సినిమా సెలబ్రిటీలంతా రాజకీయాలలో సక్సెస్ అయ్యారా అంటే? చెప్పలేని పరిస్థితి. అటు రాజకీయాలలో సక్సెస్ కాలేక మళ్ళీ సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక హీరో మాత్రం ఒకప్పుడు స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకొని.. ఇప్పుడు రాజకీయాలలో అధికారాన్ని చేపట్టి.. ఒకవైపు అధికారం.. మరొకవైపు అభిమానులను అలరించడానికి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

గత పది సంవత్సరాలుగా రాజకీయాలతోనే సావాసం చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఎట్టకేలకు 2024 సార్వత్రిక ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఒకవైపు అధికారంలో ఉన్నా.. మరొకవైపు అభిమానులను అలరించడానికి వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. అందులో భాగంగానే 'హరిహర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సెప్టెంబర్ 25న సుజీత్ దర్శకత్వంలో 'ఓ.జీ' సినిమా చేసి ప్రేక్షకులను పలకరించారు.

ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్' సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ అవడంతో ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. శ్రీ లీల హీరోయిన్ గా.. రాశిఖన్నా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాదు ఈ నెల ఆఖరిలో దీపావళి సందర్భంగా దీనిపై అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.. ఇకపోతే పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు బ్లాక్ బాస్టర్ రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీంతో అభిమానులు ఈ చిత్రంపై ఆశలు పెంచుకున్నారు. మరి గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరోవైపు హరిహర వీరమల్లు 2, ఓజీ 2 చిత్రాలు కూడా ప్రకటించారు. మరి ఈ సినిమాల షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి.