ఉస్తాద్ భగత్‌సింగ్ రిలీజ్ డేట్ పై నిర్మాత క్లారిటీ
మరోసారి ఈ కాంబినేషన్ గబ్బర్ సింగ్ తరహా మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 10 Oct 2025 9:42 AM ISTఓ వైపు నటుడిగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ చాలా బిజిగా ఉన్నారు. ఎంతో కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఓజి రూపంలో ఓ మంచి హిట్ ను ఇచ్చారు పవన్ కళ్యాణ్. ముందు నుంచే ఓజిపై మంచి హైప్ నెలకొనగా, ఆ హైప్ కు తగ్గట్టే ఓజి బ్లాక్ బస్టర్ గా నిలిచి చాలా కాలంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చింది.
పవన్- హరీష్ కలయికలో గతంలో గబ్బర్ సింగ్
ఓజి సినిమా సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఆల్రెడీ పవన్- హరీష్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్‌పై మంచి హైప్ నెలకొంది. మరోసారి ఈ కాంబినేషన్ గబ్బర్ సింగ్ తరహా మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
పవన్ పోర్షన్ షూటింగ్ పూర్తి
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ మధ్య కొన్ని వార్తలు రాగా, ఈ విషయంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్, డ్యూడ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కార్లిటీ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదని, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలో తన పోర్షన్ షూటింగ్ ను పూర్తి చేశారని చెప్పారు.
ఇంకా డేట్ ఫిక్స్ అవలేదు
సినిమాకు సంబంధించి మరో 20-25 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని, అక్టోబర్ 10 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ మొదలుకానుందని, సినిమా కోసం ఇంకా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయలేదని, షూటింగ్ పూర్తయ్యాక అన్నీ చూసుకుని సినిమాకు వీలైనంత బెస్ట్ రిలీజ్ డేట్ ను ఫైనల్ చేస్తామని రవి శంకర్ చెప్పారు. కాగా ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
