Begin typing your search above and press return to search.

ఉస్తాద్.. వింటేజ్ పవర్ స్టార్ ఈజ్ బ్యాక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా అప్డేట్ వస్తే సోషల్ మీడియాలో ఉండే సందడి వేరు. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయంలో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది.

By:  M Prashanth   |   1 Dec 2025 11:06 PM IST
ఉస్తాద్.. వింటేజ్ పవర్ స్టార్ ఈజ్ బ్యాక్!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా అప్డేట్ వస్తే సోషల్ మీడియాలో ఉండే సందడి వేరు. కానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయంలో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. 'ఓజీ' కొంత వరకు కల్ట్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. అయితే అ సినిమాకు ఉన్నంత హైప్ దీనిపై లేదన్నది మొదటి నుంచి వినిపిస్తున్న మాట. దీనికి ప్రధాన కారణం ఇది 'తేరి' రీమేక్ అనే ప్రచారం జరగడమే. అయినప్పటికీ హరీష్ శంకర్ మీద ఉన్న నమ్మకంతో ఒక వర్గం ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కొన్నాళ్ళకు హరీష్ రీమేక్ లా కాకుండా పూర్తి స్థాయిలో స్క్రీన్ ప్లే ఛేంజ్ చేసినట్లు కూడా క్లారిటీ రావడం, అలాగే రీమేక్ అని అనుకోరని నిర్మాతలు కూడా చెప్పడం పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు విడుదలైన చిన్న వీడియో క్లిప్ ఆ ఆసక్తిని పెంచే ప్రయత్నం చేసింది. మొదట విజయ్ నటించిన 'తేరి' సినిమాకు ఇది రీమేక్ అని తెలియగానే చాలామంది నిరుత్సాహపడ్డారు. దానికి తోడు హరీష్ శంకర్ గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' ఫలితం కూడా ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో సోషల్ మీడియాలో పెద్దగా హడావిడి కనిపించడం లేదు.

అయితే ఇవేమీ పట్టించుకోకుండా హరీష్ శంకర్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. విమర్శలకు సినిమాతోనే సమాధానం చెప్పాలనే కసి హరీష్ లో కనిపిస్తోంది. బయట ఎలాంటి టాక్ ఉన్నా, చిత్ర యూనిట్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ముఖ్యంగా హరీష్ శంకర్ ఈ సినిమాను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయినా, స్ట్రాంగ్ హిట్ కొట్టి విమర్శకుల నోళ్లు మూయించాలనే పట్టుదలతో ఉన్నారు.

ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో మాత్రం ఫ్యాన్స్ కు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్స్, స్టైలిష్ లుక్ చూస్తుంటే వింటేజ్ పవర్ స్టార్ వైబ్స్ వస్తున్నాయి. డాన్స్ మూమెంట్స్ లో పవన్ ఎనర్జీని హరీష్ బాగానే క్యాప్చర్ చేసినట్లు అర్థమవుతోంది. నెగటివ్ మూడ్ లో ఉన్న ఫ్యాన్స్ ను ఈ విజువల్స్ కొంతమేర ఆకట్టుకుంటున్నాయి.

ఈ డిసెంబర్ లోనే ఫస్ట్ సింగిల్ వస్తుందని ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో పాటలపై మంచి అంచనాలే ఉన్నాయి. పాట కనుక క్లిక్ అయితే సినిమాపై ఉన్న నెగటివ్ బజ్ మొత్తం మారిపోయే అవకాశం ఉంది. పవన్ స్వాగ్ కు తగ్గట్టుగా డీఎస్పీ బీట్స్ పడితే, ఫ్యాన్స్ కు అంతకంటే ఏం కావాలి? ప్రస్తుతం ఈ ఒక్క పాట మీదే సినిమా హైప్ ఆధారపడి ఉంది.