అభిమానులకు పదేళ్ల తర్వాత పీకే సర్ ప్రైజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరపై కనిపిస్తే చాలు. ఆయన డాన్సులు చేయాల్సిన పనిలేదు. అదే అభిమా నులకు పెద్ద వినోదం.
By: Srikanth Kontham | 8 Sept 2025 12:58 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరపై కనిపిస్తే చాలు. ఆయన డాన్సులు చేయాల్సిన పనిలేదు. అదే అభిమా నులకు పెద్ద వినోదం. తానో గొప్ప నటుడిని కాదని...డాన్సులు కూడా చేయడం రాదని ఆయనే అంటారు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాల్లో పెద్దగా డాన్సులు కూడా ఏవీ లేవు. ఇంకా చెప్పాలంటే ఆయన డాన్సు చేసి దశాబ్దం దాటే ఉంటుంది. `అత్తారింటికి దారేది` పెద్ద హిట్ అయింది. అందులో కొన్ని పాటల్లో డాన్సులు చేసారు. ఆ తర్వాత నటించిన ఏ చిత్రంలోనూ పవన్ డాన్సు ఎక్కడా హైలైట్ కాలేదు.
పీకే నుంచి అలాంటి మెరుపులు:
ఆ సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడంతో? వేసినా అవి వెలుగులోకి రాకపోయి ఉండొచ్చు. ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `హరిహరవీరమల్లు`లోనూ పవన్ ఎలాంటి డాన్సులు చేయలేదు. `ఓజీ`లో కూడా డాన్సులుండవ్. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ...యాక్షన్ కంటెంట్ కాబట్టి అందులో సుజిత్ డాన్సులకు ఛాన్స్ తీసుకోడు. మరి పవన్ అభిమానులు దేవుడు డాన్సులు చూసేది ఎప్పుడు? అంటే నేను ఉన్నాను గా అంటూ హరీష్ శంకర్ ముందుకొచ్చాడు. ప్రస్తుతం హరీష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
స్పెషల్ మూవీగా:
`గబ్బర్ సింగ్ `తరహాలో సినిమా ఉంటుందని అంచనా లున్నాయి. ఇందులో వింటేజ్ పవన్ కనిపిస్తారు. అలాగే అభిమానులకు కావాల్సిన అన్ని మసాలాలు కూడా ఉన్నాయంటున్నారు హరీష్. వాటితో పాటు పవన్ డాన్సులు కూడా చూడొచ్చు అంటూ హింట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కి కూడా ఈ సినిమా ఓ మంచి అనుభూతిని పంచుతుంది. యాక్షన్ సినిమాలు చేసి చేసి ఆయన బోర్ ఫీల్ అవుతున్నారు. హరీష్ శంకర్ సినిమా అయితే యాక్షన్ తోపాటు, వినోదం కూడా ఉంటుంది.
హిట్ తో అలరించేలా:
ఒక వర్గానికే కాకుండా హరీష్ కథలు అన్ని వర్గాలను టార్గెట్ చేసేలా ఉంటాయి. ఈ నేపథ్యంలో భగత్ సింగ్ లో ఎంటర్ టైన్ మెంట్ కి కొదవుండదు. హరీష్ కూడా కొంత కాలంగా ప్లాప్ ల్లోనే ఉన్నాడు. `ఉస్తాద్ భగత్ సింగ్` తోనైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని కసిగానే పని చేస్తున్నాడు. పవన్ కూడా ఈ సినిమా హిట్ తో అభిమానుల్ని అలరించాలని ఎదురు చూస్తు న్నారు. అంతకు ముందే `ఓజీ`తో భారీ హిట్ ఇచ్చి అన్ని లెక్కలు సరి చేయాలన్నది పీకే ప్లాన్. మరేం జరుగుతుందో చూడాలి.
