Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ ల మీద క్లారిటీ వచ్చేది అప్పుడేనా...

పవన్ కళ్యాణ్ లైనప్‌లో సురేందర్ రెడ్డి సినిమా, సుజీత్‌తో 'ఓజీ 2', దిల్ రాజు బ్యానర్‌లో మరో ప్రాజెక్ట్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2027 సంక్రాంతి తర్వాత సురేందర్ రెడ్డి మూవీ పట్టాలెక్కే అవకాశముంది. 2028లోపు సినిమాలన్నీ పూర్తి చేయాలని పవన్ షరతు పెట్టినట్లు టాక్. 2029 ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

By:  Gopi Velupala   |   16 Nov 2026 1:54 AM IST
పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ ల మీద క్లారిటీ వచ్చేది అప్పుడేనా...
X

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్... తన స్టైల్ తో యూత్ ను అట్రాక్ట్ చేసిన పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వం తో చాలా మంది ఆడియన్స్ ను తన అభిమానులుగా మార్చుకున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యలతను కొనసాగిస్తున్నాడు... అయినప్పటికి సమయం దొరికిన ప్రతి సారి మూవీస్ చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ సినిమాలు పట్టాలెక్కేది అప్పుడేనా?

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి అరడజన్ మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. సైరా మూవీ టైమ్ లోనే పవన్ కళ్యాణ్ తనకి మాట ఇచ్చాడు. అందుకే ఈ ప్రాజెక్ట్ మీద చర్చలు నడుస్తున్నాయి. ఇది పూర్తయ్యాక సుజీత్ తో 'ఓజీ 2' చేస్తాడు. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ లైనప్ లో మూడు సినిమాలు ఉన్నాయి. 2027 సంక్రాంతి తర్వాత నుంచి సురేందర్ రెడ్డి మూవీ పట్టలెక్కుతుందట. సుజీత్ నాని తో చేస్తున్న 'బ్లడీ రోమియో' మూవీ కంప్లీట్ అయ్యాక ఓజీ 2 సెట్స్ మీదకి వస్తుంది. వీళ్ళందరికి పవన్ కళ్యాణ్ పెట్టిన కండిషన్స్ ఏంటంటే 2028 వరకు సినిమాలన్నీ పూర్తవ్వాలని చెప్పాడట. ఎందుకంటే 2029 లో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆయన పలు మీటింగ్స్ లో పాల్గొంటూ చాలా బిజీగా ఉంటాడు. అందుకనే కొన్ని కండిషన్స్ మీద దర్శక నిర్మాతలకు ఆయన డేట్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు...

సురేందర్ రెడ్డి మూవీ ఎలా ఉండబోతుంది...

పవన్ కళ్యాణ్ చేసే మూవీలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఒకప్పటిలా ఐటెం సాంగ్స్, అల్లరి చిల్లర గా కనిపించే సన్నివేశాలన్నింటికి స్వస్తి చెప్పాడు. నిజ జీవితంలో ఒక అత్యున్నతమైన పదవి లో ఉన్నాడు. కాబట్టి వాటన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ ను త జనానికి సేవ చేసే ఒక పవర్ ఫుల్ ఎమ్మెల్యే క్యారెక్టర్ లో చూపించబోతున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి...