పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వమే ఆయనను అందరిలో ప్రత్యేకంగా నిలిపింది...
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. "తెలుగులో నా మొదటి చిత్రం.. అందులోను పవన్ కళ్యాణ్ తో ఓ జి మూవీ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది.
By: Madhu Reddy | 1 Nov 2025 2:00 AM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఒకవైపు సినిమాలలో నటిస్తూ అభిమానులను అలరిస్తూనే.. మరొకవైపు ఇటు రాజకీయంగా సామాన్య ప్రజలకు అండగా నిలుస్తూ తన వ్యక్తిత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు కష్టం వస్తే తన కుటుంబంలోని వ్యక్తులకు కష్టం వచ్చినట్టుగా భావించి, అందరికీ సమన్యాయం చేస్తూ మంచి పేరు దక్కించుకున్నారు.
ఇకపోతే ఇటు సినిమాల విషయానికి వస్తే సెట్లో తన పని తాను చేసుకుంటూ పోయే అతి కొద్ది మంది నటీనటులలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తిత్వమే ఆయనను అందరిలో చాలా ప్రత్యేకంగా నిలిపింది అంటూ బాలీవుడ్ స్టార్ కీలక కామెంట్లు చేశారు.
ఆయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ.. బాలీవుడ్ సినిమాలను ఎక్కువగా చూసే వారికి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రొమాంటిక్ సీన్స్ చేయడంలో ఈయన తర్వాతే ఎవరైనా.. అంతలా తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించే ఈయన.. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమాలో విలన్ గా ఓమి అనే పాత్ర పోషించి.. తనదైన నటనతో అందరిని మెప్పించారు. ఇకపోతే ఈ పాత్రలో ఈయన తప్ప మరొకరు చేయలేరేమో అనేంతలా ఆకట్టుకున్నారు. ఈ ఒక్క సినిమాతో తెలుగులో ఈయనకు అభిమానులు బాగా పెరిగిపోయారని చెప్పవచ్చు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. "తెలుగులో నా మొదటి చిత్రం.. అందులోను పవన్ కళ్యాణ్ తో ఓ జి మూవీ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదొక ప్రత్యేకమైన అనుభూతి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో నటించినప్పుడు ఎలాంటి అసూయ లేకుండా ప్రాధాన్యత ఇస్తారు. తన పని తాను చేసుకొని వెళ్ళిపోతారు. ఆ క్వాలిటీ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆ క్వాలిటీనే ఆయనను అందరిలో చాలా ప్రత్యేకంగా నిలిపింది " అంటూ ఇమ్రాన్ హష్మీ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పవన్ కళ్యాణ్ గురించి తెలిసిన వారు ఇది అక్షరాల నిజం అంటూ ఇమ్రాన్ హష్మీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ చిత్రాల విషయానికొస్తే.. ఓజీ ప్రీక్వెల్ తో పాటు సీక్వెల్ కూడా ఉంటుందని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత హరిహర వీరమల్లు 2 చిత్రంలో కూడా ఈయన నటిస్తారు. ఇప్పుడు మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.
