విజయ్-పవన్ మధ్య సినిమాటోగ్రాఫర్ పోలిక!
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ ఫాలోయింగ్ ఉన్న నటుడు. కోట్లాది మంది అభిమానించే నటుడు. దైవ సమానాంగా భావిస్తారు.
By: Srikanth Kontham | 2 Oct 2025 7:15 PM ISTటాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ ఫాలోయింగ్ ఉన్న నటుడు. కోట్లాది మంది అభిమానించే నటుడు. దైవ సమానాంగా భావిస్తారు. మా దేవుడు అంటూ ఆరాధిస్తారు. నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో ప్రేమిస్తారు. ప్రస్తుతం నటుడిగా...రాజకీయనాయకుడిగా రెండు రకాలుగానూ ప్రజలకు సేవలం దిస్తున్నారు. సరిగ్గా కోలీవుడ్ లోనూ ఇలాంటి హీరో ఒకడున్నారు. అతడే దళపతి విజయ్. తెలుగు అభిమానులు పవన్ ని ఎలా ఆదరిస్తారో? కోలీవుడ్ లో విజయ్ ని తమిళ అభిమానులు అంతలా ఆదరిస్తారు. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత తరం హీరోల్లో విజయ్ పెద్ద స్టార్.
విజయ్ ని మంచి కష్టపడే తత్వం అతడిది:
విజయ్ కూడా రాజకీయాల్లోకి దిగిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా సోలోగా పోటీ చేస్తున్నాడు. అలాంటి ఇద్దరు నటుల మధ్య స్టార్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస పోలిక చేసి మాట్లాడారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువగా కష్టపడే తత్వం గలవారు అంటే ఆసక్తిర సమాధానం ఇచ్చారు. ఆసంగతేంటో ఆయన మాటల్లోనే.. ఇప్పటి వరకూ తన దృష్టిలో కేవలం విజయ్ మాత్రమే కష్టపడే నటుడిగా ఉండేవారని... కానీ అతడినే పవన్ కళ్యాణ్ మించిపోయాడన్నారు. పవన్ కళ్యాణ్ తో (ఓజీ) పనిచేసిన 16 రోజులు ఓ రోలర్ కోస్టర్ ప్రయాణంలా సాగిందన్నారు.
ఒక చేతిలో కత్తి..మరో చేతిలో కలం:
పవన్ తో గతంలో పనిచేసినా? ఓజీలో మాత్రం అతడిలో విశ్వరూపం చూసానన్నారు. యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్ సీన్స్, మాస్ ఎలివేషన్లు చేస్తూనే మరోవైపు అధికారిక పనుల కోసం విమాన ప్రయాణాలు చేసేవారన్నారు. ఒక చేతిలో కత్తి..మరో చేతిలో కలం పట్టుకుని సంతకాలు చేసేవారన్నారు.జపనీస్ డైలాగులు నేర్చుకోవడం చూసానన్నారు. ఇన్ని పనులు చేయడం ఎవరికైనా కష్టమే. కానీ పవన్ ఎంతో ఇష్టంతో అవన్నీ చేసేవారన్నారు.అలా పరమ హంస పవన్ లో నటుడిని-నాయకుడిని ఒకేసారి చూసి ఎగ్జైట్ అయ్యారు.
పవన్ లా రెండు పడవల ప్రయాణం:
మరి విజయ్ ప్రయాణం ఎలా ఉంటుందన్నది చూడాలి. ప్రస్తుతానికైతే సినిమాలకు దూరంగా ఉండి కేవలం రాజకీ యాలు మాత్రమే చేస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో గెలిస్తే సీరియస్ గా రాజకీయాలపైనే దృష్టి పెడతారు. ఒకవేళ ఓడినా అంతే సీరియస్ గా రాజకీయాలను తీసుకుంటారా? సినిమా అనే మాట లేకుండా పని చేస్తారా? అన్నది చూడాలి. అలా కాకుండా పవన్ లా రెండు పడవల ప్రయాణం చేసే మరో ఆలోచన ఏదైనా ఉందా? అన్నది తెలియాలి.
