పవర్ స్టార్ న్యూ ఇయర్ సర్ ప్రైజ్.. ఆ డైరెక్టర్ తో ఫిక్స్..!
న్యూ ఇయర్ రోజు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక అదిరిపోయే న్యూస్ వచ్చింది. ఓజీ తర్వాత ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడా అన్న డౌట్ ఉంది.
By: Ramesh Boddu | 1 Jan 2026 12:13 PM ISTన్యూ ఇయర్ రోజు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక అదిరిపోయే న్యూస్ వచ్చింది. ఓజీ తర్వాత ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడా అన్న డౌట్ ఉంది. ఐతే సురేందర్ రెడ్డితో ఒక సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది కానీ ఆ సినిమా తెరకెక్కుతుందా లేదా అన్న క్లారిటీ రాలేదు. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఆ సినిమా ప్రకటన వచ్చింది. ఐతే ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తూ పవర్ స్టార్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది.
సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా..
ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ తాళ్లూరి పది సినిమాలకు పైగా చేశారు. ఐతే ఇప్పుడు రామ్ తాళ్లూరి తన కొత్త బ్యానర్ జైత్ర రామ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాతో కొత్త బ్యానర్ మొదలు పెడుతున్నారు రామ్ తాళ్లూరి.
సురేందర్ రెడ్డి 3 ఏళ్ల క్రితం ఏజెంట్ సినిమా చేశారు. అప్పటి నుంచి ఆయన నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులు అవుతుంది ఇన్నాళ్లకు ఆ సినిమాకు మార్గం సుగుమం అయ్యింది. రామ్ తాళ్లూరి తన కొత్త బ్యానర్ జైత్ర రామ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మొదలవుతున్న ఈ బ్యానర్ లో భారీ సినిమాల నిర్మాణంలో దూసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్..
పవర్ స్టార్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఎప్పుడూ ఒత్తైన జుట్టుతో కనిపించే పవర్ స్టార్ ఈ లుక్ తో కొత్తగా కనిపిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ పోర్షన్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. సినిమా ఈ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుంది. రామ్ తాళ్లూరి పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ సినిమా ప్లానింగ్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.
ఓజీ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ హిట్ జోష్ తో క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. ఓజీ తర్వాత ఉస్తాద్ కూడా ఆ ట్రీట్ కొనసాగించేలా ఉండగా ఇక సురేందర్ రెడ్డి సినిమాతో కూడా పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఏజెంట్ ఫ్లాపైనా కూడా ఈసారి పవర్ స్టార్ సినిమా మాత్రం హిట్ టార్గెట్ తోనే వస్తున్నారు సురేందర్ రెడ్డి.
