Begin typing your search above and press return to search.

బ్లాక్ సూట్‌లో ప‌వ‌న్ బాస్ వైబ్స్

ప్ర‌స్తుతం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నార‌ని స‌మాచారం. ఈ పాట‌ల్లో ప‌వ‌న్ లుక్ ఎలా ఉండ‌బోతోందో తాజాగా బ‌య‌ట‌ప‌డింది. ప‌వ‌న్ లుక్ లీక్‌కి 'కింగ్ డ‌మ్' టీమ్ కార‌ణం.

By:  Sivaji Kontham   |   31 July 2025 9:05 AM IST
బ్లాక్ సూట్‌లో ప‌వ‌న్ బాస్ వైబ్స్
X

ఇటీవ‌లే చారిత్ర‌క క‌థ‌లో యోధుడిగా క‌నిపించారు ప‌వ‌న్ క‌ల్యాణ్. 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' టైటిల్ కి త‌గ్గ‌ట్టే భారీ పోరాట ఘ‌ట్టాల‌లో విరోచిత పోరాటాల‌తో ప‌వ‌న్ మెప్పించారు. వీర‌మ‌ల్లు గురించి అభిమానుల్లో ఉత్సాహ‌క‌ర చ‌ర్చ త‌ర్వాత ఓజీ గురించి, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ గురించి ప్ర‌జ‌ల్లో చాలా ఉత్కంఠ నెల‌కొంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌దుప‌రి సినిమాల గురించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ రాజ‌కీయ షెడ్యూళ్ల‌కు బ్రేక్ ఇచ్చి, సినిమా షెడ్యూళ్ల‌తో బిజీ అయ్యారు. ప్ర‌స్తుతం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నార‌ని స‌మాచారం. ఈ పాట‌ల్లో ప‌వ‌న్ లుక్ ఎలా ఉండ‌బోతోందో తాజాగా బ‌య‌ట‌ప‌డింది. ప‌వ‌న్ లుక్ లీక్‌కి 'కింగ్ డ‌మ్' టీమ్ కార‌ణం.

తాజాగా లీకైన ఫోటోగ్రాఫ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ సూట్ ధ‌రించి ఎంతో స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. ఈ లుక్ చూడ‌గానే వ‌వ‌న్ క‌ల్యాణ్‌కి 'ఖుషి- బ‌ద్రి' డేస్ మ‌ళ్లీ వ‌చ్చాయి! అంటూ అభిమానులు ఆనందిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఆర‌వ‌ సినిమా 'బ‌ద్రి'లో ఎంతో స్టైలిష్ గా క‌నిపించారు. ఖుషి, సుస్వాగ‌తం చిత్రాల్లోను ప‌వ‌న్ ఎంతో ఇస్మార్ట్ గా క‌నిపించారు. ముఖ్యంగా సూటు బూటు ధ‌రించి కార్పొరెట్ బాస్‌లా క్లాసీగా క‌నిపించాడు ప‌వ‌న్.

ఇప్పుడు ఒక పాట చిత్రీక‌ర‌ణ కోసమే అయినా అత‌డు సూట్ ధ‌రించి ఎంతో స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌- భాగ్య‌శ్రీ జంట ప‌వ‌న్ కి ఇరువైపులా నిల‌బ‌డి ఫోటో దిగారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాప్ ఇంట‌ర్నెట్ లో సునామీలా మారింది. దీంతో పాటు కింగ్ డ‌మ్ ప్ర‌మోష‌న్ లో జోరు అమాంతం స్కైని తాకింది. తాజా ఫోటో లీక్ తో బ్లాక్ సూట్ లో ప‌వ‌న్ ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తున్నార‌ని అభిమానులు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. కింగ్ డ‌మ్ ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సంద‌ర్బంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో టీమ్ బిజీబిజీగా ఉంది.