స్క్రీన్ నేమ్ వెనుక సీక్రెట్… పవన్ కళ్యాణ్ అసలు పేరు ఇదే!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అభిమానులకు తెలియని విషయాలు ఉండవు.
By: Madhu Reddy | 10 Jun 2026 11:53 PM ISTఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అభిమానులకు తెలియని విషయాలు ఉండవు. కానీ, తాజాగా ఆయన తన పేరు వెనుక ఉన్న ఒక పెద్ద సీక్రెట్‌ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. మనందరికీ 'పవన్ కళ్యాణ్'గా తెలిసిన ఆయన అసలు పేరు అది కాదట,చిన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరొకటి ఉంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ అసలు పేరు ఏంటి? ఆ పేరు ఎలా మారింది? అనే ఆసక్తికర విశేషాలు మీకోసం.
తిరుమలలో పెట్టిన అసలు పేరు:
పవన్ కళ్యాణ్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పేరుకు సంబంధించిన అసలు విషయాన్ని పంచుకున్నారు. ఇక చిన్నప్పుడు ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో నామకరణం చేశారట. అప్పుడు ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు 'శ్రీ కళ్యాణ్ కుమార్'. ఇంట్లో అందరికంటే చిన్నవాడు కావడంతో అందరూ ముద్దుగా ‘కళ్యాణ్ బాబు’ అని పిలిచేవారట.
స్కూల్ రికార్డుల్లో మారిపోయిన పేరు:
తిరుమలలో 'శ్రీ కళ్యాణ్ కుమార్' అని పేరు పెట్టినప్పటికీ, స్కూల్లో జాయిన్ అయ్యే సమయానికి ఆ పేరు కొద్దిగా మారిపోయింది. పాఠశాల రికార్డుల్లో చేర్చేటప్పుడు 'శ్రీ' అనే పదాన్ని తీసేశారు. దాంతో ఆయన పేరు కాస్తా 'కె. కళ్యాణ్ కుమార్'గా మారిపోయింది. చదువుకునే రోజుల్లో ఆయన రికార్డులన్నింటిలో ఇదే పేరు ఉండేదట.
మార్షల్ ఆర్ట్స్ గురువు ఇచ్చిన 'పవన్':
మరి 'కళ్యాణ్ కుమార్' కాస్తా 'పవన్ కళ్యాణ్'గా ఎలా మారింది అనేదానికి ఒక పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఉంది. సినిమాల్లోకి రాకముందు ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవారు. ఇక ఆ సమయంలో ఆయన ప్రతిభను, శక్తిని చూసి ఆయన మార్షల్ ఆర్ట్స్ గురువులు ముచ్చటపడ్డారు. ఇక కళ్యాణ్ కుమార్ అనే పేరుకు ముందు 'పవన్' అని చేర్చారు. అలా అది 'పవన్ కళ్యాణ్'గా రూపాంతరం చెందింది.
హనుమంతుడితో పోలిక.. ఆ నమ్మశక్యం కాని ఫీట్:
తన పేరు ముందు 'పవన్' అని చేర్చడానికి గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే రోజుల్లో పవన్ కళ్యాణ్ చాతిపై ఏకంగా 450 కేజీల బరువున్న రాతి పలకలను ఉంచి పగలగొట్టేవారట. ఆయన చూపించిన ఆ అసాధారణమైన శక్తిని, సాహసాన్ని చూసి, వాయుపుత్రుడైన హనుమంతుడితో పోలుస్తూ గురువులు ఆయనకు 'పవన్' అనే పేరును బహుమతిగా ఇచ్చారు.
కళ్యాణ్ బాబు కాస్తా తన స్వయంకృషితో, మార్షల్ ఆర్ట్స్‌లో చూపించిన పవర్‌తో 'పవన్ కళ్యాణ్'గా మారారు. ఆ పేరుకు తగ్గట్టే ఆయన లైఫ్ స్టైల్, ఆయన ఇమేజ్ కూడా ఎంతో పవర్‌ఫుల్‌గా ఎదిగింది. ఇక సినిమాల్లో పవర్‌స్టార్‌గా, ఇప్పుడు రాజకీయాల్లో కింగ్‌గా దూసుకుపోతున్న ఆయన స్క్రీన్ నేమ్ వెనుక ఉన్న ఈ సీక్రెట్ స్టోరీ నిజంగానే అభిమానులకు ఒక స్ఫూర్తిదాయకమైన విషయమని చెప్పవచ్చు.
