'మన శంకరవరప్రసాద్ గారు' పై పవన్ రియాక్షన్.. సుస్మిత ఏమన్నారంటే?
పవన్ కళ్యాణ్ లాంటి బిజీ లీడర్ నుంచి ఇలాంటి ఒక పాజిటివ్ మెసేజ్ రావడం 'గోల్డ్ బాక్స్' టీమ్ మొత్తానికి మంచి బూస్ట్ ఇచ్చింది.
By: M Prashanth | 21 Jan 2026 11:46 PM ISTమెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న నిర్మాత సుస్మిత కొణిదెల లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రియాక్షన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మెగా అభిమానులందరూ పవర్ స్టార్ ఈ సినిమాపై ఏమన్నారో అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
నిజానికి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు సినిమా చూసే టైమ్ దొరకడం లేదు. ఇదే విషయాన్ని సుస్మిత క్లియర్ చేశారు. బాబాయ్ ఇంకా సినిమా చూడలేదని, అయితే సినిమా రిజల్ట్ గురించి మాత్రం ఆయనకు అప్‌డేట్స్ వెళ్తున్నాయని ఆమె తెలిపారు.
సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి పవన్ కళ్యాణ్ ఎంతో హ్యాపీగా ఉన్నారట. సుస్మితకు పర్సనల్‌గా మెసేజ్ చేసి మరీ విష్ చేసినట్లు ఆమె వెల్లడించారు. "సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని తెలిసి చాలా సంతోషంగా ఉంది.. ఆల్ ది బెస్ట్" అంటూ ఆయన అభినందించారని సుస్మిత చెప్పారు. బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నానని, మైండ్ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సినిమా చూస్తానని ఆయన మాటిచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ లాంటి బిజీ లీడర్ నుంచి ఇలాంటి ఒక పాజిటివ్ మెసేజ్ రావడం 'గోల్డ్ బాక్స్' టీమ్ మొత్తానికి మంచి బూస్ట్ ఇచ్చింది. ఒక ప్రొడ్యూసర్‌గా సుస్మిత చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఎప్పుడూ గౌరవిస్తారని ఈ ఇంటర్వ్యూ ద్వారా అర్థమవుతోంది. బాబాయ్ ఎప్పుడు సినిమా చూస్తారా అని మెగా ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తోందని ఆమె అన్నారు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ టైమ్ కుదుర్చుకుని సినిమా చూస్తే, ఆయన ఇచ్చే ఫీడ్‌బ్యాక్ 'మన శంకరవరప్రసాద్ గారు' టీమ్‌కు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. వింటేజ్ చిరంజీవిని మళ్ళీ స్క్రీన్ మీద చూడటం పవన్‌కు కూడా పర్సనల్‌గా ఇష్టమైన విషయం. అందుకే ఆయన స్పెషల్ స్క్రీనింగ్‌లో ఎప్పుడు సినిమా చూస్తారా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ తన అన్నయ్య సినిమా ఎప్పుడు సక్సెస్ అయినా కూడా పర్సనల్‌గా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పవచ్చు. రాజకీయ బాధ్యతల్లో ఉంటూనే తన ఫ్యామిలీ ప్రొడక్షన్‌కు సపోర్ట్ ఇవ్వడం మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇస్తోంది. బాబాయ్ ఇచ్చే అఫీషియల్ రివ్యూ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సమ్మర్ కు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
