Begin typing your search above and press return to search.

ఒకే సోఫాలో పవన్, చరణ్, బన్నీ.. చెక్ పెట్టే పెర్ఫెక్ట్ ఫ్రేమ్!

ఒకే ఫ్రేమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పిక్ ఫుల్ వైరల్ గా మారింది.

By:  M Prashanth   |   8 Sept 2025 9:52 PM IST
ఒకే సోఫాలో పవన్, చరణ్, బన్నీ.. చెక్ పెట్టే పెర్ఫెక్ట్ ఫ్రేమ్!
X

ఒకే ఫ్రేమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పిక్ ఫుల్ వైరల్ గా మారింది. ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అభిమానులను ఆకర్షిస్తోంది. అందుకే సమయంలో మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందన్న వార్తలకు చెక్ పెట్టే ఫ్రేమ్ గా నిలిచింది.

ఎందుకంటే మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య చాలా గ్యాప్ వచ్చిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. వైసీపీ అభ్యర్థికి ఇంటికి బన్నీ వెళ్లడంతో.. ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో మెగా, అల్లు అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

కొన్ని రోజుల పాటు రెండు కుటుంబాల ఫ్యాన్స్ దారుణంగా తిట్టుకున్నారు.. ట్రోల్స్ చేసుకున్నారు.. పోస్టులు పెట్టుకున్నారు. కానీ మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. ఎక్కడా మాట్లాడలేదు కూడా. కానీ తామంతా ఒక్కటేనని పలుమార్లు ప్రూవ్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీ అరెస్ట్ అవ్వడంతో అంతా స్పందించారు.

అల్లు అర్జున్ ను కలిసి పరామర్శించారు. ఒకరి బర్త్ డేకి మరొకరు విష్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా అల్లు అరవింద్ తల్లి కనక రత్నమ్మ మరణించడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్లారు. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత రోజు పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించారు.

తామంతా ఒక్కటేనని పరోక్షంగా చాటిచెప్పారు. ఇప్పుడు కనకరత్నమ్మ పెద్ద కర్మను నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అటెండ్ అయ్యారు. పవన్, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్‌ తదితరులు హాజరయ్యారు. ఆ సమయంలో పవన్, చరణ్, బన్నీ ఒకే సోఫాలో కూర్చున్నారు.

ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుతూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ముగ్గురినీ ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఫ్యాన్స్ వార్ ఇక ఆగిపోవాలని అంటున్నారు నెటిజన్లు. మెగా, అల్లు ఫ్యామిలీలు ఎప్పటికైనా ఒకటేనని చెబుతున్నారు.