ఓజీ కాన్సెర్ట్: సుజీత్‌ని ఆకాశానికెత్తేసిన పవర్‌స్టార్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా `ఓజీ` ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 22 Sept 2025 9:02 AM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా `ఓజీ` ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై ఫ్యాన్స్ లో క్రేజ్ పీక్స్ కి చేరుకుంది. ఇలాంటి సమయంలో ఓజీ కాన్సెర్ట్ పేరుతో ఈ ఆదివారం సాయంత్రం జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ స్పీచ్ ఆద్యంతం రక్తి కట్టించింది.
పవన్ ఓజీ నుంచి సుదీర్ఘ డైలాగ్ లను చెబుతూ అభిమానులను ఉర్రూతలూగించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో తలమునకలుగా ఉన్న పవన్ కల్యాణ్ కి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఆయనను ఇలా వేదికపై చూడటం అభిమానులకు కూడా పెద్ద ఉపశమనం. పవన్ వేదిక ఆద్యంతం ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించారు. అద్భుతమైన స్పీచ్ తో అలరించారు.
ఇక ఈ వేదికపై సుజీత్ గురించి మాట్లాడుతూ పవన్ ఆకాశానికెత్తేసారు. సుజీత్.. నాపై అతడి అభిమానం.. అతడి పిచ్చి ఎలాంటిదో తెలుసా.. `జానీ` హెడ్ స్కార్ప్ కట్టుకుని నెలరోజులు తీయలేదని చెప్పాడు. వాళ్ల అమ్మ గారు తిట్టి దానిని తొలగించారని పవన్ చెప్పారు. ఆ కసితోనే దర్శకుడు అయిన సుజీత్ `సాహో` చేసాడు. సుజీత్ అనే యంగ్ డైరెక్టర్ ఉన్నాడు.. అతడితో సినిమా చేయమని త్రివిక్రమ్ పరిచయం చేసారు.
సుజీత్ కథను వివరించేది తక్కువ.. సెట్స్ లో చేసేది ఎక్కువ.. కథను ముక్కలు ముక్కలుగా చెబుతాడు.. ఇలా ఉంటుంది .. ఇలా వస్తాడు.. మీ గెటప్ ఇలా ఉంటుంది.. 80లలో ఇలా ఉంటారు అని సన్నివేశాల గురించి చెబుతాడు. కానీ సెట్లో షూట్ చేసేప్పుడు అతడి సత్తా తెలుస్తుంది. మామూలుగా ఉండదు.. అంటూ పవన్ ఆకాశానికెత్తేసారు.
ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్ .. పవన్ కల్యాణ్ కాదు.. సినిమాకి ఏది బాగా రావాలన్నా దర్శకుడు -రచయిత ముఖ్యం. ఆ క్రెడిట్ సుజీత్ కే చెందుతుంది. ఇది బాగా రావాలంటే థమన్ సాయం అవసరం. వీళ్లంతా ఒక ప్రయాణంలో ఉంటే అందులోకి నన్ను కూడా లాగారు`` అని పవన్ చెప్పుకొచ్చారు. అయితే ఓజీ ట్రైలర్ రాక కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూసిన అభిమానులు ట్రైలర్ రాక ఆలస్యం కావడంతో చాలా కోపోద్రిక్తులయ్యారు. వేదిక వద్ద కేకలు అరుపులతో హోరెత్తిపోయింది. ఇక ఓజీ ప్రమోషన్స్ కోసం డిజైన్ చేసిన వేదిక అత్యంత భారీతనంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఓజీ కాన్సెప్టుతో బ్లాక్ డ్రెస్సుల్లో ఓజీ టీమ్ ఈ వేదికకు హాజరుకావడం, గొడుగులు పట్టుకుని వర్షంలో తడుస్తూ ఈ స్పీచ్ లు ఇవ్వడం ప్రతిదీ సినిమాటిగ్గా ఉన్నా, ఇది అభిమానులను ప్రత్యేకంగా అలరించింది.
