కరెక్ట్ గా చెప్పాలంటే ఆడ శివంగి: పవన్ కల్యాణ్
ఇప్పుడు `ఓజీ కాన్సెర్ట్` (ప్రీరిలీజ్ వేడుక)లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనతో కలిసి నటించిన ఒక నటీమణిని వేదికపైకి పిలిచిన తీరు, గౌరవించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Sivaji Kontham | 22 Sept 2025 10:51 AM ISTఎదుటివారిని గౌరవిస్తూ మాట్లాడటం సంస్కారానికి సంబంధించిన మ్యాటర్. రెస్పెక్ట్ మ్యాటర్స్ లో మెగా హీరోలు వారి వినమ్రత, గౌరవాన్ని ఎప్పుడూ తగ్గనివ్వరు. ఇప్పుడు `ఓజీ కాన్సెర్ట్` (ప్రీరిలీజ్ వేడుక)లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనతో కలిసి నటించిన ఒక నటీమణిని వేదికపైకి పిలిచిన తీరు, గౌరవించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది.
తన స్పీచ్ ఆద్యంతం దర్శకుడు సుజీత్, థమన్ సహా ఇతర సాంకేతిక నిపుణులు సీనియర్ నటులను గుర్తు చేసుకుంటూ మాట్లాడిన పవన్ కల్యాణ్ ఓవర్‌లుక్ లో సీనియర్ నటి శ్రీయా రెడ్డి గురించి స్పీచ్ లో ప్రస్థావించడం మర్చిపోయారు. దానికి సారీ చెబుతూ పవన్ కల్యాణ్.. శ్రీయారెడ్డిని వేదికపైకి ఎంతో గౌరవంగా అభిమానంగా ఆహ్వానించారు.
``శ్రీయ రెడ్డి గారు ప్లీజ్ ఇటు రండి.. చెప్పడం మర్చిపోయాను.. ఒక బ్రిలియంట్ పెర్ఫామర్ శ్రేయా రెడ్డి గారు. వాటే పవర్ ఫుల్ పెర్ఫామర్.. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక ఆడ శివంగి.. ఆమె ఫిట్నెస్ లెవల్స్ చూస్తే మతిపోద్ది.. ఎవరైనా గొడవ పెట్టుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి`` అని పవన్ అన్నారు. ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించాలనుందని శ్రేయా రెడ్డిగారు అడిగారు.. నేను మీకు మాటిస్తున్నాను.. భవిష్యత్ లో మనం మరో సినిమాలో కలిసి పని చేస్తున్నాము`` అని ప్రామిస్ చేసారు.
ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఈ వేదికకు రాలేదని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఒక సాధారణ నటుడిగానే వేదికపై ఉల్లాసంగా మాట్లాడారు. మహిళలకు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ మ్యాటర్ ఈ వేదికపై హైలైట్ అయింది. ఓవైపు పవన్ వేదికపై మాట్లాడుతుంటే, మరోవైపు వర్షంలో తడుస్తూ అభిమానులు ఓజీ ఓజీ అంటూ నినాదాలతో చాలా గడబిడ చేసారు.
ఓజీలో శ్రేయారెడ్డి ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించారు. తనకు ఎప్పటి నుంచో ఇలాంటి ఒక పాత్రలో నటించాలనుందని శ్రేయారెడ్డి పలుమార్లు అన్నారు. ఓజీలో తన పాత్ర విషయంలో సంతృప్తిని వ్యక్తం చేసారు. నిజానికి శ్రేయారెడ్డి పవర్ ఫుల్ పెర్ఫామర్ గా ఇప్పటికే నిరూపించారు. తన మరిది విశాల్ (విక్రమ్ కృష్ణ సోదరుడు) సినిమాలో విలన్ గా నెగెటివ్ పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు ఓజీలో శ్రేయారెడ్డి నటన ఎలా ఉంటుందో చూడాలనే ఉత్కంఠ అభిమానులకు ఉంది. ముఖ్యంగా పవర్ స్టార్ ఇంతగా పొగిడేశాక, మెగా ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్ గా వేచి చూడకుండా ఉండలేరు కదా! సెప్టెంబర్ 25 డే రోజున అన్ని విషయాలు తేల్తాయి.
