Begin typing your search above and press return to search.

ఓజీ Vs కబ్జా.. వివాదమేంటి? నిజమేనా?

ఇప్పుడు ఓజీ మూవీని పొగుడుతున్నా.. అప్పుడు కబ్జా సినిమా టైమ్ లో ఎవరూ రెస్పాండ్ అవ్వలేదని వ్యాఖ్యానించారు.

By:  M Prashanth   |   23 Oct 2025 10:18 AM IST
ఓజీ Vs కబ్జా.. వివాదమేంటి? నిజమేనా?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ (They Call Him OG) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ డ్రామాగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి మెప్పించింది.

అయితే రీసెంట్ గా ఆ సినిమాపై కన్నడ డైరెక్టర్ ఆర్. చంద్రు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే. 2023లో ఆయన కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా తెరకెక్కించిన కబ్జా మూవీ స్ఫూర్తితోనే సుజీత్ ఓజీ తీశారని చంద్రు ఆరోపించారు. కొన్ని సీన్స్ చూసి తాను షాక్ అయ్యానని వెల్లడించారు.

సినిమాలోని చాలా సన్నివేశాలు కబ్జా మూవీలో సీన్స్ ను పోలి ఉంటాయని వ్యాఖ్యానించారు. ట్రైలర్ చూస్తేనే అది అర్థమవుతుందని ఆరోపించారు. సినిమా ఇండస్ట్రీలో ఇది సహజమేనని అన్న చంద్రు.. తాను కూడా పవన్ ఫ్యాన్ అని తెలిపారు. కానీ తాను అప్పుడు కబ్జా మూవీ చేసినప్పుడు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు.

ఇప్పుడు ఓజీ మూవీని పొగుడుతున్నా.. అప్పుడు కబ్జా సినిమా టైమ్ లో ఎవరూ రెస్పాండ్ అవ్వలేదని వ్యాఖ్యానించారు. ఓజీలో గన్ షాట్స్.. కబ్జాలో ఉన్నట్లుగానే ఉన్నాయని అన్నారు. అయితే కబ్జా మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కానీ ఇప్పుడు సినిమా ప్రభావమే.. దాని విజయానికి రుజువు అని పేర్కొన్నారు చంద్రు.

అయితే ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినీ ప్రియులు, నెటిజన్లు, పవన్ కళ్యాణ్ అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. డిజాస్టర్ గా నిలిచిన సినిమాతో ఇప్పుడు ఓజీ మూవీని పోల్చడం అవసరమా అని అనేక మంది ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కాపీ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. చంద్రు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ, ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అదే సమయంలో ఆ విషయంపై ఇంకా సుజీత్ సహా ఓజీ మూవీ టీమ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో క్లారిటీ ఇవ్వాలని పలువురు నెటిజన్లు, సినీ ప్రియులు ఓజీ టీమ్ ను కోరుతున్నారు. కాపీ అంటూ చంద్రు చేసిన ఆరోపణలపై స్పందించాలని పోస్టులు పెడుతున్నారు. మరి మూవీ టీమ్ నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో వేచి చూడాలి.