ఓజీ: ఓవర్సీస్ లో అడ్వాన్స్ సేల్స్ హవా.. టాప్ రికార్డ్ లిస్ట్ ఇదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన ఓజీ సినిమా మీద అంచనాలు రోజురోజుకి మరింత పెరుగుతున్నాయి.
By: M Prashanth | 17 Sept 2025 3:41 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన ఓజీ సినిమా మీద అంచనాలు రోజురోజుకి మరింత పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న సినిమా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా, ట్రేడ్ వర్గాలు ఓవర్సీస్ లో జరుగుతున్న అడ్వాన్స్ సేల్స్ ను గమనిస్తూ ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లో హిట్స్ కొనసాగుతున్న ఈ నెలలో, ఓజీ రాకతో బాక్సాఫీస్ దగ్గర మరింత రచ్చ జరగనుందని చెబుతున్నారు.
సినిమా టీం రిలీజ్ కి ముందే అగ్రెసివ్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్ అభిమానుల్లో హైప్ ను మరింత పెంచాయి. ప్రత్యేకంగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
థమన్ మ్యూజిక్, సుజీత్ మేకింగ్ తో సినిమా థియేటర్లలో విజువల్ ఫీస్ట్ గా మారుతుందని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా సాగుతున్నాయి. నార్త్ అమెరికా ప్రీమియర్స్ లో ఓజీ రికార్డ్ స్థాయిలో టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. ఇంకా రిలీజ్ కి రోజులు ఉన్నా 1.5 మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడం, పవన్ కళ్యాణ్ క్రేజ్ కి నిదర్శనంగా నిలిచింది.
ఈ స్పీడ్ చూస్తుంటే ఓపెనింగ్స్ దగ్గరే భారీ రికార్డులు బద్దలవుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. సెప్టెంబర్ లో వరుస హిట్స్ తో బాక్సాఫీస్ ఊపందుకుంది. లిటిల్ హార్ట్స్, మిరాయ్ మంచి ఫలితాలు సాధించగా, ఇప్పుడు ఓజీ కూడా రికార్డులను బద్దలు కొట్టేలా దూసుకెళ్తోంది. ఇదే సమయంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా ఓవర్సీస్ లో బలమైన ప్రీమియర్స్ కలెక్షన్లు సాధిస్తున్నాయి.
ఇక యూఎస్ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ లిస్ట్ ఇలా ఉంది:
కల్కి 2898 AD - 1.6 మిలియన్ డాలర్లు (2,754 షోలు)
పుష్ప 2 - 1.55 మిలియన్ డాలర్లు (3,532 షోలు)
ఓజీ - 1.5 మిలియన్ డాలర్లు (1,720 షోలు)
దేవర - 1.48 మిలియన్ డాలర్లు (1,735 షోలు)
గేమ్ చేంజర్ - 3.59 లక్షల డాలర్లు (1,124 షోలు)
హరిహర వీరమల్లు - 1.69 లక్షల డాలర్లు (977 షోలు)
