Begin typing your search above and press return to search.

యూఎస్లో OG ర్యాంపేజ్.. నెవ్వర్ బిఫోర్ అనేలా!

దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుండగా.. ముందు రోజే అమెరికాలో ప్రీమియర్ షోస్ పడనున్నాయి.

By:  M Prashanth   |   30 Aug 2025 11:52 AM IST
యూఎస్లో OG ర్యాంపేజ్.. నెవ్వర్ బిఫోర్ అనేలా!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సందడి అప్పుడే మొదలైపోయింది. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుండగా.. ముందు రోజే అమెరికాలో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఓ రేంజ్ లో ప్రీ సేల్స్ జరుగుతున్నాయి.


సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తోంది. టికెట్స్ పెట్టడమే లేటు.. వెంటనే సేల్ అయిపోతున్నాయి. ప్రీమియర్స్ తోనే ఓజీ భారీ వసూళ్లు సాధించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వన్ మిలియన్ మార్క్ ను దాటేలా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రిలీజ్ కు ముందు అనేక రికార్డులు క్రియేట్ చేయనుందని అంతా ఊహిస్తున్నారు.

అయితే ఇప్పుడు అత్యంత వేగంగా ఐదు ల‌క్ష‌ల డాల‌ర్లకు పైగా ప్రీమియ‌ర్స్ ప్రీ సేల్స్ జ‌రిగిన తొలి సినిమాగా ఓజీ నిలిచింది. ఈ మేరకు మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. సుమారు రూ. 4.15 కోట్లకు పైగా ప్రీమియర్స్ ప్రీ సేల్స్ జరిగినట్లు వెల్లడించారు. దాంతోపాటు స్పెషల్ పోస్టర్ ను కూడా షేర్ చేశారు.

అందులో పవన్ వేరే లెవెల్ లో ఉన్నారు. అదే సమయంలో మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటుంది. "క్ష‌ణ‌క్ష‌ణ‌మొక త‌ల తెగి ప‌డెలే" అంటూ టైటిల్ సాంగ్‌ లోని లిరిక్‌ ను క్యాప్షన్ రూపంలో ఇచ్చారు మేకర్స్. దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఓజీ ర్యాంపేజ్ అంటూ సినీ ప్రియులు, ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. గ్యాంగ్ స్టర్ గా అలరించనున్నారు. ఆయన సరసన యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

సినిమాలో శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సిరి లెళ్ల తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాణీలు అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఓజీ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో.. ఓవర్సీస్ లో ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.