ఓజీపై రూమర్స్‌కి నిర్మాత క్లారిటీ.. ఫ్యాన్స్ ఆందోళనకి ఎండ్ కార్డ్
టాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఎన్ని సినిమాలున్నా కూడా అందరి ఫోకస్ ఎక్కువగా OG పైనే ఉంది.
By: M Prashanth | 26 Aug 2025 10:18 PM ISTటాలీవుడ్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఎన్ని సినిమాలున్నా కూడా అందరి ఫోకస్ ఎక్కువగా OG పైనే ఉంది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రతి అప్‌డేట్‌ని మేకర్స్ పర్ఫెక్ట్ టైమింగ్‌లో రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చారు. లుక్ పోస్టర్స్, సెట్ స్టిల్స్, సోషల్ మీడియా రిప్లైస్ అన్నీ కలిపి ఓజీకి సూపర్ బజ్ తీసుకొచ్చాయి. అయితే తాజాగా ఈ అప్‌డేట్స్ కొంచెం తగ్గిపోయాయని కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.
ఈ మధ్యకాలంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధికారిక హ్యాండిల్‌ను ఫ్యాన్స్ ట్యాగ్ చేస్తూ “ఎందుకు అప్‌డేట్స్ రావడం లేదు?”, “హ్యాండిల్ అడ్మిన్ మారిపోయాడా?” అని ప్రశ్నించారు. కొందరు నెటిజన్లు నిజంగానే అడ్మిన్ మారిపోయాడని కామెంట్స్ కూడా చేశారు. ఈ రూమర్స్ పెద్ద ఎత్తున వైరల్ కావడంతో యంగ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ దాసరి స్వయంగా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు.
“డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా హ్యాండిల్‌ను RRR టైమ్ నుంచి Wall & Trends చూసుకుంటోంది. ఇప్పటికీ అదే టీమ్ ఉంది. ఎటువంటి మార్పులు లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు కూడా అర్థం కావడం లేదు” అని నిర్మాత స్పష్టం చేశారు. అదే సమయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి తప్పుడు సమాచారం నమ్మకూడదని కోరారు. “ఓజీ కోసం బెస్ట్ కంటెంట్ ప్లాన్ చేసి అందిస్తాం. కానీ రూమర్స్‌ని నమ్మి అనవసరంగా హడావుడి చేయొద్దు” అని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల కొందరు నెటిజన్లు “మేకర్స్ కొందరు ఫ్యాన్స్‌కే ఫేవర్ చేస్తున్నారు” అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై కూడా కళ్యాణ్ దాసరి స్పందిస్తూ “ఇలాంటి ఫేవరిటిజం మా నుంచి ఎప్పుడూ జరగదు. యూట్యూబ్ లేదా సోషల్ మీడియా కాపీరైట్ స్ట్రైక్స్ ఇవ్వడం ఇండస్ట్రీలో సాధారణమే. దాంట్లో ఎటువంటి పక్షపాతం లేదు” అని క్లారిటీ ఇచ్చారు.
“ఓజీ ఒక సినిమా మాత్రమే కాదు.. ఫ్యాన్స్ కోసం, థియేటర్స్‌లో ఒక సంబరంలా ప్లాన్ చేసిన సినిమా. గత మూడు ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న యూఫోరియా అలాగే కొనసాగుతోంది. ఇక ముందు కూడా అదే తరహా ఉత్సాహాన్ని అందిస్తాం. చిన్న చిన్న నాయిస్‌లను పక్కన పెట్టి, రాబోయే పండుగను ఎంజాయ్ చేద్దాం” అంటూ నిర్మాత స్పష్టం చేశారు.
ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. థమన్ కంపోజ్ చేసిన సువ్వి సువ్వి అనే మెలొడీ సాంగ్ రేపే రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సాంగ్ పవన్ మరో వైపు చూపిస్తుందని యూనిట్ చెబుతోంది. మరోవైపు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. మొత్తానికి అభిమానుల్లో అనవసర ఆందోళన, రూమర్స్ అన్నింటికీ ఈ క్లారిటీతో ఎండ్ కార్డ్ పెట్టారు నిర్మాత.
