Begin typing your search above and press return to search.

ఓజీ మరో సర్ప్రైజ్.. పవన్ యాక్షన్ సీన్స్ తోనా?

ఆడియన్స్ లో ఇప్పటికే ఓజీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫుల్ గా పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ అయింది.

By:  M Prashanth   |   4 Aug 2025 4:20 PM IST
ఓజీ మరో సర్ప్రైజ్.. పవన్ యాక్షన్ సీన్స్ తోనా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో ఓజీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య నిర్మిస్తుండగా.. యంగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్న ఆ సినిమాకు ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇప్పటికే మూవీ షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారు. మరికొద్ది రోజుల్లో వాటిని కూడా పూర్తి చేయనున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. దసరా కానుకగా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రీసెంట్ గా మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఆడియన్స్ లో ఇప్పటికే ఓజీ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫుల్ గా పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ అయింది. ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఆ బజ్ ను సద్వినియోగం చేసుకొనేందుకు మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్స్ ఫై ఫోకస్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

విడుదలకు ముందే ప్రాజెక్ట్‌ కు అవసరమైన దృష్టిని విజయవంతంగా తీసుకువచ్చింది. సినిమా రిలీజ్ అవ్వడానికి రెండు నెలల కంటే తక్కువ సమయమే ఉన్నా.. పాటతో మేకర్స్ లో జోష్ పెరిగింది. మూవీ కోసం మాట్లాడుకునేలా చేసింది. టాలీవుడ్ లోనే ఆల్‌ టైమ్ హైయ్యెస్ట్ లైక్స్ అందుకున్న సాంగ్ గా ఫైర్ స్టార్మ్ సాంగ్ రికార్డుకెక్కింది.

24 గంట‌లు పూర్తి కాకుండానే.. పాట రికార్డు స్థాయిలో లైక్స్ ద‌క్కించుకుంది. దీంతో మూవీ కోసం ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో క్లియర్ గా అర్థమవుతుంది. ఓజీ సినిమాలో ప‌వ‌న్ ఓజాస్ గంభీర పాత్ర‌ను ఎలివేట్ చేసేలా ఉన్న సాంగ్.. థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ కు పూన‌కాలు తెప్పించ‌నుందని అందరికీ ఫుల్ గా క్లారిటీ వచ్చేసింది.

ఇప్పుడు సినిమా నుంచి మరో సర్ప్రైజ్ రానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీన మేకర్స్ నుంచి స్పెషల్ అప్డేట్ వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీజర్ లేదా మేకింగ్ వీడియో లేదా మరో కొత్త సాంగ్ వస్తుందని ఆడియన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ విషయంపై ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ.. స్పెషల్ అప్డేట్ లో పవన్ స్టైలిష్ లుక్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు ఉండవచ్చనే వినికిడి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.