OG డైరెక్టర్ ని మైండ్ బ్లాక్ చేసిన పవన్..!
ఇందులో కొన్ని పవన్ కళ్యాణ్ ఇంప్రవైజేషన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. రీసెంట్ గా అదే విషయాన్ని డైరెక్టర్ సుజిత్ చెప్పాడు.
By: Ramesh Boddu | 29 Sept 2025 12:37 PM ISTపవర్ స్టార్ ఓజీ సినిమాలో ఆయన స్వాగ్ ని చూసి ఫ్యాన్స్ అంతా పిచ్చోళ్లైపోతున్నారు. ఎందుకు ఆయన ట్రెండ్ సెట్టర్ అన్న దానికి ఈ సినిమా ఒక సమాధానం అనేలా ఫ్యాన్స్ హంగామా నడుస్తుంది. ఐతే సినిమాలో సుజిత్ డైరెక్షన్ టేకింగ్ ఎంత హైలెట్ అనేది చూస్తే తెలుస్తుంది. ఇందులో కొన్ని పవన్ కళ్యాణ్ ఇంప్రవైజేషన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. రీసెంట్ గా అదే విషయాన్ని డైరెక్టర్ సుజిత్ చెప్పాడు. ఓజీ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ ని అసలైతే ఒక్క నడిచి వచ్చే షాట్ ఒక్కటి తీద్దామని అనుకున్నాం. ఐతే అక్కడ కళ్యాణ్ గారు వాచ్ ని తిప్పూతూ వచ్చారు.
పవర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్ లో అరుపులు..
ఆ షాట్ చాలా అద్భుతంగా అనిపించింది. అందుకే అది అలా కాదని మల్టిపుల్ లెన్స్ లో షూట్ చేశామని అన్నాడు సుజిత్. సో డైరెక్టర్ చెప్పిన సీన్ ని పవన్ ఇంప్రవైజ్ చేసి నటించారన్నమాట. సో అది థియేటర్ లో అరుపులు అనిపించింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఐతే ఆ షాట్ ని అలా చూస్తూ ఉండిపోవాలనే రేంజ్ లో ఎంజాయ్ చేశారు. సుజిత్ ఈ సినిమాను ఎంత ప్యాషన్ తో తీయాలని అనుకున్నారన్నది పవన్ కళ్యాణ్ కనిపెట్టారు అందుకే ఆయన చిన్న చిన్న ఇన్ పుట్స్ ని కూడా సినిమాకు యాడ్ చేసి దీన్ని మరింత క్రేజీగా మార్చారు.
ఓజీ సినిమా సుజిత్ యూనివర్స్ అని అంటున్నారు. సినిమాటిక్ యూనివర్స్ కాబట్టే సాహో చిన్నప్పటి రోల్ ని ఇందులో పెట్టారు. ఐతే ఓజీ 2 కథలో సాహో కూడా ఉంటాడా.. సుజిత్ ఓజీ 2 ని పవన్ కళ్యాణ్ తోనే చేస్తాడా లేదా మరో హీరోని తో కొనసాగిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రభాస్, పవన్ కళ్యాణ్ ని ఒకే సినిమాలో చూపించాలనే ప్లాన్ ఉంటే మాత్రం బాక్సాఫీస్ లు షేక్ అయిపోవడం పక్కా అని చెప్పొచ్చు.
సుజిత్ సినిమాటిక్ యూనివర్స్..
ప్రభాస్, పవన్ ఇద్దరు కూడా సరైన కథ కుదిరితే కలిసి నటించేందుకు రెడీ అంటారు. కానీ ఇద్దరు కాస్త టైం ఇవ్వాలంతే.. ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సాహో ఈ రెండిటికీ సీక్వెల్ గా ఒక సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు. సుజిత్ నెక్స్ట్ నానితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుజిత్ మళ్లీ పెద్ద ప్లానింగ్ తోనే వస్తాడని చెప్పొచ్చు. నానితో సినిమాను కూడా భారీ బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తున్నారట.
