ఓజీ.. 'కూలీ'లా కాకూడదంటే..
గతనెల భారీ అంచనాలతో కూలీ థియేటర్లలోకి వచ్చింది. అయితే డైరెక్టర్ లోకేష్ కు ఎల్పీయూ ఉంది కాబట్టి.. కూలీ సినిమా కూడా అందులో భాగమే అని అనుకున్నారు. రిలీజ్ కు ముందు అదే ప్రచారం జరిగింది.
By: M Prashanth | 22 Sept 2025 10:28 PM ISTఈ రోజుల్లో ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే దాని ట్రైలర్ చూసి స్టోరీని గెస్ చేయడం ట్రెండ్ అయిపోయింది. సోషల్ మీడియా వాడకం పెరిగాక ఇది ఇంకా ఎక్కువైంది. ఫ్యాన్స్ ట్రైలర్ వీడియోతోనే వివిధ రకాలుగా డీ కోడ్ చేసేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ విషయంలోనూ అదే జరుగుతోంది. ఓజీ ట్రైలర్ చూశాక ఫ్యాన్స్ సినిమా స్టోరీని అంచనా వేస్తున్నారు.
అయితే ఇక్కడ చాలా మంది ఈ సినిమాకు ప్రభాస్ సాహోతో లింక్ పెడుతున్నారు. ట్రైలర్ లో ఓ దగ్గర షిప్ యార్డ్ కంటైనర్ పై వాజి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ అనే బోర్డు ఉంది. ఇది సాహోలో మాఫియాకు సంబంధించిన పేరు. దీంతో రెండు సినిమాలకు కనెక్షన్ ఉందని ఊహలు ఊహించేసుకుంటున్నారు. అయితే ఓజీకి సాహోకు ఎలాంటి లింక్ లేదని తెలుస్తోంది.
డైరెక్టర్ సుజిత్ యూనివర్స్ ఫ్రాంచైజీలు చేసే ఆలోచనలో లేడు. ఆయన కేవలం పవన్ అభిమానిగానే ఈ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా కంప్లీట్ 1980ల్లో సాగే కథ. కానీ సాహోను ప్రజెంట్ టైమ్ లైన్ చూపించారు. అందుకే ఈ సినిమాతో సాహోకు ఎలాంటి కనెక్షన్ లేదా లింక్ ఉండవని సమాచారం. అయితే ఈ ప్రచారం జోరందుకోకముందే మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేదంటే లోకేష్ కూలీ సినిమాలాగా నష్టపోవాల్సి ఉంటుంది.
గతనెల భారీ అంచనాలతో కూలీ థియేటర్లలోకి వచ్చింది. అయితే డైరెక్టర్ లోకేష్ కు ఎల్పీయూ ఉంది కాబట్టి.. కూలీ సినిమా కూడా అందులో భాగమే అని అనుకున్నారు. రిలీజ్ కు ముందు అదే ప్రచారం జరిగింది. ఒకట్రెండ్ సందర్భాల్లో కూలీకి లోకేశ్ ఎల్పీయూకు సంబంధం లేదని ఇది ఓ ఇండిపెండెంట్ స్టోరీ అని మేకర్స్ చెప్పే ప్రయత్నమైతే చేశారు. కానీ, అది ప్రేక్షకులకు పర్ఫెక్ట్ గా రీచ్ అవ్వలేదు. దీంతో అవే అంచనాలతో థియేటర్లలోకి వెళ్లారు ఆడియెన్స్.
కానీ ప్రేక్షకుల అంచనాలను కూలీ రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయ్యింది. వాస్తవానికి మొదట్నుంచీ ఇది ఎల్పీయూలో భాగం కాదు అనుకొని థియేటర్ కు వెళ్లి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదేమో. ఇండిపెండెంట్ స్టోరీ అనకొని వెళ్తే సాటిస్ఫై అయ్యే వారు కావొచ్చు. కానీ అనవసర ప్రచారం సినిమాను దెబ్బ తీసింది. అందుకే కూలీలా ఎఫెక్ట్ పడకూడదంటే ఓజీ మేకర్స్ రిలీజ్ కు ముందే ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అప్పుడైతేనే ఓజీ స్టోరీ పట్ల ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది.
ఇక ఓజీ విషయానికొస్తే.. ట్రైలర్ తో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ విశ్వరూపం సెప్టెంబర్ 25న చూస్తామంటూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇందులే వైలెన్స్, పవన్ డైలాగ్స్, తమన్ సంగీతంకు మాత్రం థియేటర్లు దద్దరిల్లేలా ఉన్నాయి. కానీ ట్రైలర్ లో ఎన్ని అంచనాలు ఉన్నా.. తెరపై బొమ్మ పడితేగానీ ఓ క్లారిటీ రాదు. మరో రెండు రోజుల్లో అంతా తేలిపోతుంది.
