Begin typing your search above and press return to search.

పవన్ OG.. ట్రైలర్ రికార్డ్స్ లో స్థానమెంత?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతోపాటు సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ ఓజీ.

By:  M Prashanth   |   23 Sept 2025 12:55 PM IST
పవన్ OG.. ట్రైలర్ రికార్డ్స్ లో స్థానమెంత?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతోపాటు సినీ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్న మూవీ ఓజీ. కొన్నాళ్ల క్రితం మొదలైన ఆ సినిమా మధ్యలో హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. విజయదశమి కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది.

ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్సెస్, సాంగ్స్ అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేసింది. గ్యాంగ్ స్టర్ గా పవర్ స్టార్ లుక్, స్టైల్, స్వాగ్ అదిరిపోయిందని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్.. ట్రైలర్ కట్ తో సుజీత్ అదరగొట్టేశారు.

ఓవరాల్ గా ఓజీ మూవీ ట్రైలర్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది. యూట్యూబ్ లో భారీ లైక్స్ ను సంపాదించుకుంటోంది. అయితే 16 నిమిషాల్లో లక్ష లైక్స్ ను దక్కించుకున్న ఓజీ ట్రైలర్.. టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 100K లైక్స్ సాధించిన లిస్ట్ లో 11వ స్థానంలో నిలిచింది.

ఫాస్టెస్ట్ 100K లైక్స్ సాధించిన ట్రైలర్ లిస్ట్ ఇదే!

సలార్ ట్రైలర్- 3 నిమిషాలు

భీమ్లా నాయక్- 4 నిమిషాలు

వకీల్ సాబ్- 7 నిమిషాలు

కల్కి 2898 ఏడీ- 7 నిమిషాలు

ఆర్ఆర్ఆర్- 8 నిమిషాలు

పుష్ప 2 - 8 నిమిషాలు

సర్కార్ వారి పాట- 9 నిమిషాలు

ఆది పురుష్- 9 నిమిషాలు

దేవర- 9 నిమిషాలు

గుంటూరు కారం- 15 నిమిషాలు

ఓజీ (They Call Him OG) - 16 నిమిషాలు

అదే సమయంలో లక్ష లైక్స్ లైక్స్ జాబితాలో 11వ స్థానంలో ఉన్న ఓజీ.. రెండు లక్షల లైక్స్ లిస్ట్ లో తొమ్మిదో ప్లేస్ లో ఉంది. 35 నిమిషాల్లో ఆ మార్క్ ను క్రాస్ చేసింది. ఆ జాబితాలో మళ్లీ మొదటి స్థానంలో సలార్ మూవీనే ఉంది. గుంటూరు కారం మాత్రం మిస్ అయింది. దీంతో తొమ్మిదో స్థానంలో ఓజీ ట్రైలర్ నిలిచింది. మరి ఆ లిస్ట్ మీ కోసం..

సలార్ ట్రైలర్- 7 నిమిషాలు

భీమ్లా నాయక్- 9 నిమిషాలు

ఆర్ఆర్ఆర్- 18 నిమిషాలు

పుష్ప 2 - 19 నిమిషాలు

వకీల్ సాబ్- 20 నిమిషాలు

సర్కార్ వారి పాట- 21 నిమిషాలు

కల్కి 2898 ఏడీ- 21 నిమిషాలు

దేవర- 27 నిమిషాలు

ఓజీ- 35 నిమిషాలు

అయితే ఇప్పటి వరకు ఓజీ ట్రైలర్.. ఆరు లక్షలకు పైగా లైక్స్ ను సాధించడం గమనార్హం.