Begin typing your search above and press return to search.

పవన్ OG.. ఏది జరిగినా మన మంచికే!

పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   30 Sept 2025 9:45 PM IST
పవన్ OG.. ఏది జరిగినా మన మంచికే!
X

ఏది జరిగినా మన మంచికే.. అని పెద్ద వాళ్ళు ఎప్పుడూ చెబుతుంటారు. ఇప్పుడు ఓజీ మూవీ విషయంలో అదే జరిగిందని అంటున్నారు కొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, మరికొందరు సినీ ప్రియులు. మేకర్స్ కు ఇప్పుడు మంచే జరిగిందని చెబుతున్నారు. అసలేం జరిగింది? ఎందుకలా అంటున్నారు? విషయమేంటి?

పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఆ చిత్రాన్ని దానయ్య, కళ్యాణ్ ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా ప్రీమియర్స్ సెప్టెంబర్ 24న పడగా, సెప్టెంబర్ 25న రిలీజైంది.

భారీ అంచనాల మధ్య రిలీజైన ఓజీ.. ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. రిపీట్ మోడ్ లో థియేటర్స్ కు రప్పించింది. మిగతా మూవీ లవర్స్ కు కాస్త అప్సెట్ చేసినా.. అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఆ తర్వాత కూడా.. ఫ్యాన్స్ సినిమాను ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేశారు. థియేటర్స్ లో మళ్లీ మళ్లీ చూశారు.

మిగతా ఆడియన్స్ కూడా సినిమాకు వెళ్లాలనుకున్నా కుదరలేదు. ఎందుకంటే టికెట్ రేట్లను మేకర్స్ భారీగా పెంచారు. దీంతో అనేక మంది సినిమా చూసేందుకు మొగ్గు చూపించలేదు. దీంతో ఫస్ట్ వీకెండ్ అయ్యాక వసూళ్లలో తగ్గుదల కనిపించింది. ధరలు తగ్గితే.. మూవీ చూద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నారు.

ఇంతలో అటు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లు.. టికెట్ రేట్లను తగ్గించి థియేటర్ల ఆక్యుపెన్సీ పెంచారు. ఇటు తెలంగాణలో లాయర్ మల్లేష్ యాదవ్.. ధరల పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ ఇచ్చిన అనుమతులపై హైకోర్టుకు వెళ్లారు. దీంతో జడ్జి శ్రవణ్ కుమార్.. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేశారు.

ఆ తర్వాత తెలంగాణ పోలీసులు హెచ్చరికల జారీ చేశారు. వెంటనే రేట్లు తగ్గించాలని.. లేకుంటే చర్యలు తీసుకుంటామని మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు తెలిపారు. దీంతో మంగళవారం నుంచి రేట్లు తగ్గాయి. ఇప్పుడు ఆక్యుపెన్సీ కచ్చితంగా పెరుగుతుంది. ఫెస్టివల్ సీజన్ కాబట్టి థియేటర్స్ కు తరలి వెళ్తారు ఆడియన్స్. కాబట్టి హైకోర్టు ఆదేశాలు మేకర్స్ కు మంచే చేకూర్చాయని అంటున్నారు.