ఓజీ సినిమా ఆ ఫీలింగ్ ఇస్తుంది: ఇది పక్కా ఓ ఎక్స్ పరిమెంట్
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా దగ్గరపడుతున్నా కొద్దీ హైప్ పెరిగిపోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, పాటలు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.
By: M Prashanth | 10 Sept 2025 9:21 PM ISTపవన్ కళ్యాణ్ ఓజీ సినిమా దగ్గరపడుతున్నా కొద్దీ హైప్ పెరిగిపోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, పాటలు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇందులో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తొలి నుంచీ చెబుతున్నట్లుగానే ఈ సినిమాకు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు.
ఈ సినిమాతో మన తెలుగు మ్యూజిక్ పవర్ సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ తెలుసుస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అందుకు తగ్గట్లుగానే అదిరే సంగీతం అందించారు. డిఫరెంట్ టైప్, జపాన్ మ్యూజికల్ వాయిద్యాలు నెక్ట్స్ లెవెల్ లో వాయించారు. దీని గురించి ఆయన్ను తాగాగా పాల్గొన్న ఈవెంట్లో అడగ్గా సమాధానమిచ్చారు.
కొత్త కొత్త వాయిద్యాలు బాగానే వాయిస్తున్నారు సార్ అని రిపోర్టర్ అడిగారు. దీనికి తమన్.. అవును, కొన్ని సినిమాలే మనకు వేరే దేశం ఫీలింగ్ ఇస్తాయి. ఆఫ్రికా సినిమాగానీ, ఆఫ్రికా నేపథ్యం కథగానీ, ఒక జపానీస్, ఒక చైనీస్ కథగానీ, ఒక యూఎస్ లో ఉండే కథ గానీ, చాలా అరుదుగా ఈ ఫీనామినల్ జరుగుతుంది. కానీ జపానీస్ కు ఉండే మ్యూజికల్ కల్చర్ వేరు. అది రీఫ్రెష్ మ్యూజికల్. ఈ కల్చర్ ను మనం ఇండియా సినిమాకు ఎలా అడాప్ట్ చేసుకొని చేద్దామనేది ఉంది. అలా ఓజీ అనేది మ్యూజికల్ గా ఓ ఎక్స్పరిమెంట్. అని తమన్ చెప్పారు.
ఈ సినిమా నుంచి రిలీజైన ఫైర్ స్ట్రోమ్ పాటకు మాత్రం యూత్ ఫుల్ వైబ్ అవుతోంది. ఈ పాటకు తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. ఈపాటకు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. ఇలా మాస్ మాత్రమే కాకుండా క్లాస్ టచ్ కూడా ఇచ్చారు. సువ్వి, సువ్వి అంటూ సాగే మెలోడీ సాంగ్ వింటేజ్ పవన్ ను గుర్తు చేస్తోంది. మ్యూజిక్ పరంగానూ ఓజీ సెన్సేషనల్ కానుందని తమన్ అలా చెప్పకనే చెబుతున్నారు.
కాగా, సినిమా రిలీజ్ కు ఇంకో 14 రోజులే మిగిలి ఉంది. దీనికి ఉన్న హైప్ తో ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే ఓజీ ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ప్రీమియర్స్ ప్రీ బుకింగ్స్ లోనే 1.25 మిలియన్ డాలర్లు సాధించింది. త్వరలోనే ఇండియాలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. విడుదలకు తేదీ దగ్గర పడుతుడడంతో మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్నారు. ట్రైలర్ రిలీజ్ తోపాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది.
