Begin typing your search above and press return to search.

తెలంగాణలోనూ OG ప్రీమియర్స్.. ఏపీ కన్నా కాస్ట్ తక్కువే!

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఓజీ.. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.

By:  M Prashanth   |   20 Sept 2025 10:12 AM IST
తెలంగాణలోనూ OG ప్రీమియర్స్.. ఏపీ కన్నా కాస్ట్ తక్కువే!
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ కోసం అటు సినీ ప్రియులు.. ఇటు అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు బొమ్మ పడుతుందా.. చూసేద్దామా.. అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్స్ అయ్యారు.

ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఓజీ.. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. అంతకుముందు రోజు ప్రీమియర్స్ కూడా పడనున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ను మొదలుపెట్టగా.. పెద్ద ఎత్తున సేల్స్ జరుగుతున్నాయి.

మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రీమియర్స్ కు కూడా ప్రీ బుకింగ్స్ ను మొదలుపెట్టనున్నారు మేకర్స్. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బెనిఫిట్ షో, 10 రోజుల పాటు టికెట్ రేట్ల పెంపు కోసం పర్మిషన్ అందుకున్నారు. 25వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట షోకు టికెట్ రేటును రూ.1000 (జీఎస్టీతో కలిపి)గా మేకర్స్ నిర్ణయించారు.

ఇప్పుడు మూవీ నిర్మాతల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇచ్చి అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్‌ వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. టికెట్‌ ధర జీఎస్టీతో కలిపి రూ.800గా ప్రకటించింది. అక్టోబరు 4 వరకు టికెట్‌ ధరల పెంపునకు కూడా వీలు కల్పించింది.

సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి ఓజీ మేకర్స్ రీసెంట్ గా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నెట్టింట ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇక మూవీ విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌ గా కనిపించనున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, , సిరి లెళ్ల (నారా రోహిత్ కు కాబోయే భార్య) వంటి పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా.. డీవీవీ దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.