Begin typing your search above and press return to search.

ఓజీ డైరెక్టర్.. పవన్ అనే ఎమోషన్ తోనే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ తీసి సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సుజిత్. సాహో తర్వాత సుజిత్ గ్యాప్ తీసుకుని ఓజీ మీద 3 ఏళ్లు టైం పెట్టి చేశాడు.

By:  Ramesh Boddu   |   2 Oct 2025 10:35 AM IST
ఓజీ డైరెక్టర్.. పవన్ అనే ఎమోషన్ తోనే..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ తీసి సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సుజిత్. సాహో తర్వాత సుజిత్ గ్యాప్ తీసుకుని ఓజీ మీద 3 ఏళ్లు టైం పెట్టి చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో మరోసారి పవన్ కళ్యాణ్ మీద తన అభిమానం చూపించాడు సుజిత్. సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు తమ్ముడు పోస్టర్ చూసి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఐతే ఒకటి రెండు సినిమాలు చేసి ఎటో వెళ్తున్న తనని నేచర్ కళ్యాణ్ గారి దగ్గరకు తీసుకొచ్చింది. కళ్యాణ్ గారు ఒక ఎమోషన్.

రిలీజ్ ముందు టెక్నికల్ టీం సపోర్ట్..

సినిమా చూసిన అందరు ఎలివేషన్స్ బాగున్నాయని అంటున్నారు. కళ్యాణ్ గారిని నేను జస్ట్ షూట్ చేశానంటే.. నిజంగానే ఎలిమేషన్స్ చేయాలనుకుంటే మాత్రం అంటూ సైలెంట్ అయ్యాడు. సినిమా రిలీజ్ ముందు టెక్నికల్ టీం సపోర్ట్ ఉంటుంది. రిలీజ్ అయ్యాక హై ఉంటుంది కానీ రిలీజ్ ముందు లో టైం లో టెక్నికల్ టీం మాత్రమే సపోర్ట్ గా ఉంటారు.

ఈ సినిమా చేస్తున్న టైంలోనే మరో సినిమా చేయాలని అనిపించింది. ఇప్పుడు ఆయన నోటి నుంచే ఓజీ యూనివర్స్ చేస్తా అనండం హ్యాపీ థింగ్ అని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి అభిమానించడం వేరు.. ఆయన్ను డైరెక్ట్ చేయడం వేరు. ఈ విషయంలో సుజిత్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆయనతో పనిచేస్తూ ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ లాంటి సినిమా ఇచ్చాడు సుజిత్.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్..

సినిమా తీయడం ఒక ఎత్తైతే అదే కాన్ఫిడెన్స్ తో మాట్లాడటం మరో ఎత్తు. ఓజీ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ మూవీగా సుజిత్ ఇచ్చాడు. అందుకే ఆయన స్పీచ్ లో ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా బాగాలేదని చెబుతాడా అని చూశా అని అన్నాడు సుజిత్.

ఓజీ సక్సెస్ మీట్ లో సుజిత్ తన టీం ని పరిచయం చేశాడు. 3 ఏళ్లు తనతో వీళ్లంతా కూడా డే అండ్ నైట్ కష్టపడ్డారని అన్నాడు. ఓజీ సినిమాలో జానీ రిఫరెన్స్ ముందు కథ రాసుకున్నప్పుడే ఉంది. కానీ కళ్యాణ్ గారికి చెప్పలేదు. జానీ సినిమా చూసే తాను సినిమాల్లోకి వచ్చానని జానీ సినిమా కమర్షియల్ లెక్కలు తెలియదు కానీ ఫ్యాన్స్ కి అదొక ఎమోషన్ అని అన్నారు సుజిత్.

ఓజీ సినిమాకు ఇద్దరు మెయిన్ పిల్లర్స్ అని.. థమన్, ఎడిటర్ నవీన్ నూలి ఇద్దరు సినిమా కోసం చాలా కష్టపడ్డారని అన్నాడు సుజిత్. ఈ సినిమాపై ఆడియన్స్ లో ముందు నుంచి ఒక పాజిటివ్ బజ్ ఉంది. ఫస్ట్ కాల్ దిల్ రాజు గారి నుంచే వచ్చింది ఫ్యాన్స్ కి నచ్చుతుంది అంటే కాదు కచ్చితంగా సూపర్ హై ఇస్తుందని తాను చెప్పానని అన్నాడు సుజిత్.