పవన్ OG.. 2 రోజుల్లో అంత షూట్ చేసేశారా?
అయితే అప్పుడు గ్యాంగ్ స్టర్ సినిమాలో లవ్ సీన్స్ ను ఎందుకు తీస్తున్నారని పవన్ తనకు అడిగినట్లు పేర్కొన్నారు. అప్పుడు యాక్షన్ సీక్వెన్స్ కూడా ఫాలో అప్ చేస్తామని పవన్ కు హామీ ఇచ్చినట్టు చెప్పారు.
By: M Prashanth | 26 Sept 2025 12:12 AM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ (They Call Him OG). ముంబై బ్యాక్ డ్రాప్ తో యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఆ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ సందడి చేస్తోంది చిత్రం.
దీంతో ఓజీ మూవీ టీమ్ అంతా హ్యాపీ మోడ్ లో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయగా.. సుజీత్ కూడా అటెండ్ అయ్యారు. ఆ సమయంలో ఓజీ జర్నీ కోసం మాట్లాడారు. అదే సమయంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రెండు రోజుల్లో మూడు కీలకమైన సీన్స్ ను కంప్లీట్ చేసినట్లు తెలిపారు.
సినిమా కోసం బెస్ట్ అవుట్ పుట్ రాబట్టేందుకు ఎలా వర్క్ చేశానో సుజీత్ వెల్లడించారు. మనకు కావలసిందల్లా ఆయనను నమ్మకంగా ఒప్పించాలని, అది జరిగాక అవసరమైతే ఏం చేసేందుకు అయినా రెడీగా ఉంటారని తెలిపారు. మొదటి రోజు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ పై వచ్చే లవ్ సీన్స్ ను షూట్ చేసినట్లు చెప్పారు.
అయితే అప్పుడు గ్యాంగ్ స్టర్ సినిమాలో లవ్ సీన్స్ ను ఎందుకు తీస్తున్నారని పవన్ తనకు అడిగినట్లు పేర్కొన్నారు. అప్పుడు యాక్షన్ సీక్వెన్స్ కూడా ఫాలో అప్ చేస్తామని పవన్ కు హామీ ఇచ్చినట్టు చెప్పారు. రెండో రోజు ఓజాస్ గంభీర బాంబే ఎంట్రీ సీన్, కాలు పెట్టగానే వచ్చే వాటర్ సీక్వెన్స్ సన్నివేశాన్ని షూట్ చేసినట్లు తెలిపారు.
అదే రోజు ముంబై పోలీస్ స్టేషన్ సీన్ కూడా చిత్రీకరించినట్లు చెప్పారు. మూడో రోజు మధురై పోలీస్ స్టేషన్, ఫస్ట్ హాఫ్ లాడ్జ్ సీక్వెన్స్ ను పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుజీత్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు, పవన్ ఫ్యాన్స్ తెగ రెస్పాండ్ అవుతున్నారు.
సుజీత్ చెప్పిన సీన్స్ సినిమాలోని కీలకమైనవి. కేవలం రెండు రోజుల్లో వాటిని పూర్తి చేయడమే మామూలు విషయం కాదు. షూటింగ్ ను పూర్తి చేసేందుకు ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారో క్లియర్ గా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్.. జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు.
