Begin typing your search above and press return to search.

OG బాక్సాఫీస్: అమెరికాలో లెక్క ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఒక పవర్ఫుల్ వైబ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు.

By:  M Prashanth   |   26 Sept 2025 12:31 PM IST
OG బాక్సాఫీస్: అమెరికాలో లెక్క ఎంతంటే?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఒక పవర్ఫుల్ వైబ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. కొత్త సినిమా రాబోతోందంటేనే అభిమానుల్లో జోష్ మొదలవుతుంది. అదే ఇప్పుడు ‘OG’ సినిమాతో మరోసారి స్పష్టమైంది. థియేటర్ల ముందు క్యూలు, బుకింగ్స్‌లో హడావుడి, సోషల్ మీడియాలో హంగామా ఇలా ప్రతి చోటా ఓజీ ప్రభావం కనిపిస్తోంది.

ముఖ్యంగా అమెరికాలో మాత్రం ఈ సినిమా ఊహించని స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. రిలీజ్ కు ముందే ఫ్యాన్స్ కేరింతలు, థియేటర్లలో వేడుకల మాదిరిగా ప్రీమియర్స్ సాగాయి. పవన్ స్టైల్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోయారు. ఫస్ట్ హాఫ్ ఎంట్రీ సీన్స్, ఎలివేషన్లు, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కలిసి ఫ్యాన్స్‌కు పండుగలా మారాయి.

సినిమా టాక్ మిక్స్‌ డ్ గా ఉన్నా, పవన్ కల్యాణ్ కోసం మాత్రమే థియేటర్లు నిండిపోతున్నాయి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే, నార్త్ అమెరికాలో ‘ఓజీ’ అసలు మాస్ రికార్డు సృష్టించింది. మొదట అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే మిలియన్ మార్క్ దాటేసిన ఈ సినిమా, ప్రీమియర్ షోలలో 3.7 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇప్పటివరకు తెలుగు సినిమాల ఓవర్సీస్ రికార్డుల్లో టాప్‌లో నిలిచిన సినిమాల్లో ఇప్పుడు ఓజీ కూడా తన పేరు నమోదు చేసుకుంది. ఇప్పటికే కల్కి, ఆర్ఆర్ఆర్, పుష్ప 2, దేవర వంటి సినిమాలు అమెరికాలో భారీ ఓపెనింగ్స్ సాధించాయి. ఆ జాబితాలో ఇప్పుడు పవన్ సినిమా కూడా బలంగా చేరింది.

ఇలా వరుసగా కొత్త సినిమాలు అక్కడ అద్భుతమైన వసూళ్లు సాధించడం తెలుగు సినిమాల మార్కెట్ ఎంత పెద్దదైందో మరోసారి నిరూపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనియా మాత్రం అక్కడ మరో రేంజ్ కు దాటిపోయింది. టాక్ కొంచెం బాగున్నా కూడా పవన్ హవా మాములుగా ఉండదని అర్ధమవుతుంది.

అమెరికాలో తెలుగు సినిమాలు సాధించిన ప్రీమియర్స్ వసూళ్లలో టాప్ ఫైవ్ ఇలా ఉన్నాయి

కల్కి: 3.9 మిలియన్ డాలర్లు

ఆర్ఆర్ఆర్: 3.5 మిలియన్ డాలర్లు

పుష్ప 2: 3.34 మిలియన్ డాలర్లు

ఓజీ: 3.7 మిలియన్ డాలర్లు

దేవర: 2.85 మిలియన్ డాలర్లు