ఏంది సామి అరాచకం.. ఒక్క పాటతో ఈ రేంజ్ హైపా
అదంతా టీజర్ తోనో, ట్రైలర్ తోనో కాదు.. కేవలం ఒక్క పాటతోనే. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి శనివారం ఓ పాట రిలీజైంది.
By: M Prashanth | 3 Aug 2025 11:16 PM ISTఏ సినిమాకైనా టీజర్, ట్రైలర్ తో హైప్ క్రియేట్ అవుతుంది. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఆయన లీడ్ రోల్ లో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాకు వేరే లెవెల్ లో హైప్ క్రియేటైంది. అదంతా టీజర్ తోనో, ట్రైలర్ తోనో కాదు.. కేవలం ఒక్క పాటతోనే. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి శనివారం ఓ పాట రిలీజైంది. ఇది సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. అలా తొలి పాటతో ఓజీ ప్రమోషన్లు షురూ అయ్యాయనే చెప్పుకోవాలి.
అయితే ఆ పాట రిలీజ్ విషయంలో మేకర్స్ తొలి నుంచీ ఓ పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్లారు. శనివారం ఈ పాట రిలీజ్ చేస్తున్నామని చెప్పి.. మ్యూజిక్ డైరెక్టక్ థమన్ కొంతమేర సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేశారు. డైరెక్టర్ తో పాట లీక్ అయ్యిందని చేసిన ఫ్రాంక్ కాల్ ఇందులోని భాగమే. అలా పవర్ స్టార్ ఫ్యాన్స్ మూడ్ ను హరిహర వీరమల్లు రిజల్ట్ నుంచి బయట పడేశారు. ఈ విధంగా పాటపై ఫుల్ బజ్ క్రియేట్ చేశారు.
మొదట్నుంచీ అంచనాలు ఉన్నట్లే థమన్ ఈ పాటను గ్రాండ్ గా డిజైన్ చేశారు. మ్యూజిక్, పాట లిరిక్స్, బీజీఎమ్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. ఒక్క పాటతో సోషల్ మీడియాను షేక్ చేశారు. థమన్ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ ఉందంటూ ఫ్యాన్స్ సైతం ఫుల్ సాటిఫై అయ్యారు. ఇక ఈ పాటకు థియేటర్లు బద్దలవడమే ఆలస్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ పాటతో ఓజీ పై హై లెవెల్ బజ్ క్రియేట్ అయ్యింది. సోషల్ మీడియాలో పవన్ స్టార్ ఫ్యాన్స్ హంగామా వేరే లెవెల్ లో ఇంది. 24 గంటల్లోనే ఈ పాటకు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో ఇది టాప్ ట్రెండిగ్ లో కొనసాగుతోంది. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా ట్రైలర్ కూడా నిన్నే రిలీజ్ అయ్యింది.
ఆ ట్రైలర్ కు ధీటుగా ఈ ఓజీ పాట ట్రెండింగ్ లో ఉంది. ఇది చూసిన నెటిజన్లు ఏంది ఒక్క పాటతో ఇంత హైప వస్తుందా అని షాక్ అవుతున్నారు. ఇక ఈ పాట థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తుందని ఇప్పటికే ఫ్యాన్స అంచనాలు పెంచుకుంటున్నారు. కాగా, సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తుండగా.. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
