Begin typing your search above and press return to search.

OG ప్రమోషనల్ సెటెప్.. ప్లాన్ అదుర్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ మూవీగా వస్తుంది ఓజీ.

By:  Ramesh Boddu   |   13 Sept 2025 9:42 AM IST
OG ప్రమోషనల్ సెటెప్.. ప్లాన్ అదుర్స్..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో స్టైలిష్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ మూవీగా వస్తుంది ఓజీ. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ లాక్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషనల్ సెటప్ అంతా కూడా ఒక రేంజ్ ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. సినిమాపై ఇప్పటికే హ్యూజ్ బజ్ ఉండగా ఇక రాబోయే 12 రోజుల్లో సినిమాను మరింత ప్రమోట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

గన్స్ అండ్ రోజెస్ సాంగ్..

సెప్టెంబర్ 15 నుంచి ఓజీ ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారు. 15న సినిమా నుంచి గన్స్ అండ్ రోజెస్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 18న ట్రైలర్ రిలీజ్ చేస్తారట. సెప్టెంబర్ 19న ఇండియాలో ఓజీ టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేస్తారట. సెప్టెంబర్ 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తారని టాక్.

ఓజీ ప్రమోషనల్ సెటప్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా పవన్ కళ్యాణ్ తన డేట్స్ అడ్జెస్ట్ మెంట్ చేసుకుంటున్నారట. ఇప్పటికే ఫ్యాన్స్ లో ఓజీ సినిమాపై ఒక రేంజ్ హైప్ ఉంది. అందుకు తగినట్టుగానే ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. హరి హర వీరమల్లు సినిమాకు ఎలాగైతే రిలీజ్ రెండు రోజుల ముందు ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాలకు పవన్ ఇంటర్వ్యూస్ ఇచ్చారో ఓజీకి కూడా అలాంటి ప్లానింగ్ ఉందని తెలుస్తుంది.

ఓజీ కోసం థమన్ బెస్ట్..

ఓజీ సినిమాకు థమన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. ఓజీ కోసం థమన్ తన బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఓజీ సినిమాలో ఆమె లుక్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైల్ ని సుజిత్ నెక్స్ట్ లెవెల్ లో చూపించారన్న టాక్ వస్తుంది. మరి సినిమా ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందో చూడాలి.

యూఎస్ లో నెల ముందే టికెట్స్ ఓపెన్ అవగా రిలీ ముందే 1 మిలియన్ కలెక్ట్ చేసిన ఓజీ అంచనాలకు తగినట్టుగా ఉంటే మాత్రం సంచలన రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు.ఈ ఇయర్ రాబోతున్న క్రేజీ సినిమాల్లో ఓజీ ఒకటి కాగా.. ఆ సినిమా ఫ్యాన్స్ కి ఎలాంటి ఫీస్ట్ అందిస్తుంది అన్నది చూడాలి.