ఓజీ మేకర్స్ పై మెగా ఫ్యాన్స్ ఒత్తిడి.. అలా చేయాలని డిమాండ్
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ఓజీ ఈ ఏడాది తెలుగు సినిమా ప్రపంచంలోనే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా నిలిస్తోంది.
By: M Prashanth | 15 Sept 2025 1:29 PM ISTపవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ఓజీ ఈ ఏడాది తెలుగు సినిమా ప్రపంచంలోనే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా నిలిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ సేల్స్ లో ఓజీ దుమ్ముదులిపేస్తుంది. దీంతో సినిమామై హైప్ అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఈ సినిమా పాన్ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. అందుకే ఓజీను తెలుగు రాష్ట్రాలే కాకుండా బయట రాష్ట్రాల్లోనూ బాగా ప్రమోట్ చేయాల్సిన అవసరం మేకర్స్ కు ఉంది.
పవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా, పొరుగు రాష్ట్రాలలో కూడా మంచి మార్కెట్ ను దక్కించుకునే సత్తా ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ప్రమెషన్స్ ను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. దానివల్లే సినిమా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని మేకర్స్ గమణించాల్సిన అవసరం ఉంది.
రీసెంట్ గా తేజా సజ్జా నటించిన మిరాయ్ సినిమా, భారీ ప్రమోషన్ల వల్లే పెద్ద స్థాయిలో ఓపెనింగ్ సాధించిందన్న విషయం ఓజీ టీమ్ గుర్తించాల్సిందే. ఓజీ ఒక ప్రాంతీయ చిత్రం మాత్రమే కాదు. ఇది పాన్ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న సినిమా. అందుకే, దేశవ్యాప్తంగా ప్రమోషన్లపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇదే. సినిమా యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందినది కాబట్టి, అన్ని భాషల ప్రేక్షకులనూ ఈ జానర్ ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి నెగెటివ్ పాత్రలో నటిస్తున్నారు. నార్త్ ఇండియాలో ప్రమోషన్లలో ఆయనన భాగం చేయాలి. అలా అయితే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్.. ఈ సినిమా రిలీజ్ కు మూడు రోజులు ప్రమోషన్లకు టైమ్ ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే, ప్రస్తుత హైప్ ను దృష్టిలో ఉంచుకుని ఆయనను నార్త్ ఇండియా ప్రమోషన్లకు కూడా ఆయనను తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి.
అటు మెగా ఫ్యాన్స్ కూడా ప్రమోషన్స్ వీలైనంత త్వరగా ప్రారంభించాలని మెగా అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ కు 10 రోజులే ఉండడంతో పూర్తి స్థాయిలో ప్రమోషన్లను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కి సుజీత్ దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించారు. యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నారు. సినిమా విడుదలకు 10 రోజులే ఉండటంతో, ప్రమోషన్లలో వేగం పెంచాల్సిన సమయం ఆసన్నమైంది.
