ఇప్పుడు పవన్ కు అంత టైముందా?
పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్న ఓజి సినిమా మరో 20 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.
By: Sravani Lakshmi Srungarapu | 6 Sept 2025 9:00 AM ISTపవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్న ఓజి సినిమా మరో 20 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలుండగా, ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గించకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు డైరెక్టర్ సుజిత్.
భారీ అంచనాలతో వస్తున్న ఓజి
ఇప్పటి వరకు ఓజి నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఫ్యాన్స్ నుంచి సాధారణ ఆడియన్స్ వరకు అందరినీ ఎగ్జైట్ చేసేలా ఉండటంతో ఓజిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఓజి బిజినెస్ భారీగా జరిగింది. ఏరియాల వారీగా బయ్యర్లు కూడా లాకైపోతున్నారు. థియేట్రికల్ అగ్రిమెంట్స్ కూడా మంచి ఊపు మీద జరుగుతున్నాయి. అఖండ2 రాకపోవడంతో సోలో రిలీజ్ దక్కింది.
రూ.5 లక్షలు పెట్టి ప్రీమియర్ టికెట్
సెప్టెంబర్ 25న రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్క్రీన్లంటిలో ఓజినే ఉన్నా ఆశ్చర్యపడాల్సిన పన్లేదు. రీసెంట్ గా ఓజి ప్రీమియర్ టికెట్ ను రూ.5 లక్షలు పెట్టి మరీ కొన్నారంటే సినిమాపై క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో రోజులుగా ఆకలితో ఉన్న తమకు ఓజి సినిమా ఫుల్ మీల్స్ పెడుతుందని పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎంతో ఆశగా ఉన్నారు.
రిలీజ్ కోసం భారీ ప్లాన్లు
ఆ నమ్మకంతోనే రెండు రాష్ట్రాల్లో భారీ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఓజి ప్రమోషన్స్ కు పవన్ టైమిస్తారా లేదా అనేది ప్రశ్నగా మారింది. రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు ప్రమోషన్స్ కోసం పవన్ తన బిజీ షెడ్యూల్ ను సర్దుబాటు చేసుకుని మరీ టైమ్ కేటాయించారు. ఇప్పుడు వీరమల్లు లానే ఓజికి కూడా అలానే పవన్ టైమిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
పవన్ కు కుదురుతుందా?
అయితే పవన్ ఓజి ప్రమోషన్స్ కు వచ్చినా రాకపోయినా ఎలాంటి నష్టం లేదు. ఆల్రెడీ సినిమాపై కావాల్సినంత హైప్ ఉంది. కాబట్టి పవన్ వచ్చి సినిమాను కొత్తగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. పైగా సెప్టెంబర్ 18నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలుంటాయి కాబట్టి డిప్యూటీ సీఎంగా పవన్ బిజీగా ఉంటారు. కాదు కూడదని పవన్ తో ఏదైనా ప్రమోషన్స్ చేయించాలంటే ముందే ఇంటర్వ్యూలు చేయించి రెడీగా పెట్టుకుని ఓ వారం ముందు వాటిని వదలాల్సి ఉంటుంది. కానీ పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరి ఓజి ప్రమోషన్స్ కోసం టైమ్ కేటాయించే వీలు ఆయనకుందో లేదో చూడాలి.
