Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ కి పవర్ స్టార్ వస్తే..?

బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కాబోతుంది. ఈ సీజన్ ని చాలా ప్రీ ప్లాండ్ గా సూపర్ సక్సెస్ చేయాలని వస్తున్నారు బిగ్ బాస్ టీం.

By:  Ramesh Boddu   |   1 Sept 2025 6:00 PM IST
బిగ్ బాస్ కి పవర్ స్టార్ వస్తే..?
X

బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కాబోతుంది. ఈ సీజన్ ని చాలా ప్రీ ప్లాండ్ గా సూపర్ సక్సెస్ చేయాలని వస్తున్నారు బిగ్ బాస్ టీం. ఇక బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది అంటే నేషనల్ వైడ్ గా దీని ఫ్యాన్స్ ఎంగేజ్ అవుతారు. ఐతే బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఆ 3 నెలల్లో రిలీజ్ అయ్యే సినిమాల ప్రమోషన్స్ కూడా కలిసి వస్తుంది. మిగతా ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ ఎన్ని చేసినా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే చాలా పెద్ద పబ్లిసిటీ దక్కుతుంది.

బిగ్ బాస్ ఒక పెద్ద ప్రమోషనల్ స్టేజ్..

ముఖ్యంగా చిన్న సినిమాల రిలీజ్ కు బిగ్ బాస్ ఒక పెద్ద ప్రమోషనల్ స్టేజ్ గా మారుతుంది. నాగార్జున తో కొందరు వీకెండ్ ఎపిసోడ్స్ లో పాల్గొంటే కొందరు సడెన్ గా హౌస్ లోకి వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారు.

బిగ్ బాస్ సీజన్ 9 కి ఒక పవర్ ఫుల్ ఛాన్స్ స్టార్ వస్తాడని సంకేతాలు వస్తున్నాయి. అదేంటి అంటే సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి పవన్ కళ్యాణ్ సరే అన్నారట. రీసెంట్ గా రిలీజైన హరి హర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ రిలీజ్ ముందు రెండు రోజులు బీభత్సమైన ప్రమోషన్స్ చేశారు. హైదరాబాద్, వైజాగ్ రెండు ఈవెంట్స్ లో పాల్గొనడమే కాదు అన్ని పత్రికలకు, డిజిటల్ మీడియాకు, ఛానెల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు.

OG కోసం బిగ్ బాస్ స్టేజ్ మీద..

ఐతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 మొదలవుతుంది కాబట్టి ఓజీ ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ స్టేజ్ మీదకు వస్తారా అన్న చర్చ మొదలైంది. పవర్ స్టార్ లాంటి హీరోలకు బిగ్ బాస్ కి వచ్చి సినిమాను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఐతే బాలీవుడ్ లో రిలీజ్ టైం లో ఇలాంటి టాక్ షోస్ కి స్టార్స్ కూడా వెళ్తుంటారు. ఐతే ఇక్కడ మాత్రం స్టార్స్ అలా చేయరు.

ఒకవేళ ఓజీ ప్రమోషన్స్ కి బిగ్ బాస్ హౌస్ లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం షో టి.ఆర్.పి బ్లాస్ట్ అవ్వక తప్పదు. ఓజీ మీద అసలే భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే మాత్రం ఆడిటోరియం దద్దరిల్లిపోవాల్సిందే. మరి బిగ్ బాస్ సీజన్ 9 లో పవర్ స్టార్ వసతాడా.. అది జరుగుతుందా అన్నది చూడాలి.