Begin typing your search above and press return to search.

వీరమల్లు డిజాస్టర్.. OG నిర్మాత లక్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   31 Aug 2025 1:00 AM IST
వీరమల్లు డిజాస్టర్.. OG నిర్మాత లక్ ఎలా ఉందంటే?
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం నిర్మాత భారీ బడ్జెట్ తో మూవీ గ్రాండ్ గా నిర్మించారు.

అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన వీరమల్లు.. అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. మేకర్స్ కు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్.. ఆయన అప్ కమింగ్ మూవీ ఓజీపై హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఓజీ మూవీకి సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా.. అప్పుడే మూవీ సందడి మొదలైపోయింది.

యూఎస్ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా.. మన దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. పవన్ గత మూవీ వీరమల్లు డిజాస్టర్ అయినప్పటికీ.. ఓజీకి ఓ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటం విశేషం. అసలు ఆ సినిమా ఎఫెక్ట్ పడలేదు. దీంతో ఇప్పుడు మూవీ నిర్మాత డీవీవీ దానయ్యకు పెద్ద జాక్ పాట్ కు ఓజీ మారినట్లు కనిపిస్తోంది.

భారీ బడ్జెట్ తో ఓజీ మూవీని నిర్మించిన ఆయన ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ ను అమ్మేశారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఓజీ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ ను రికార్డు ధరకు సేల్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చిత్రాల అత్యధిక వసూళ్లు కన్నా పెద్ద నెంబర్స్ తో డీల్ జరిగినట్లు సమాచారం.

అయితే దానయ్య.. చివరగా ఆర్ ఆర్ ఆర్ మూవీతో భారీ లాభాలను ఆర్జించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వేరే లెవెల్ లో ప్రాఫిట్స్ అందుకున్నారు. ఇప్పుడు ఓజీ మూవీ కూడా ఆయనకు కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా మూవీ హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.