OG బిజినెస్.. ఆ లిస్ట్ లో ఎన్నో ప్లేస్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన మూవీ ఓజీ. సుజిత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ గ్రాండ్ గా నిర్మించారు.
By: M Prashanth | 23 Sept 2025 1:49 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన మూవీ ఓజీ. సుజిత్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ గ్రాండ్ గా నిర్మించారు. ఇప్పుడు దసరా కానుకగా థియేటర్స్ లో సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే విడుదలకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశారు ఓజీ మేకర్స్. సెన్సార్ ఫార్మాలిటీస్ నూ కంప్లీట్ చేశారు. ఏ సర్టిఫికెట్ ను అందుకున్నారు. అదే సమయంలో ప్రీ రిలీజ్ బిజినెస్ ను చాలా రోజుల క్రితమే పూర్తి చేశారు. సినిమాకు ఉన్న క్రేజ్ బట్టి.. అన్ని డీల్స్ మంచి నెంబర్స్ తో ఖరారు చేశారని సమాచారం.
అయితే ఓజీ మూవీ.. 172.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా టాలీవుడ్ లో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ సాధించిన సినిమాల జాబితాలో 12వ స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప-2 ది రూల్ మూవీ రూ.617 కోట్ల బిజినెస్ జరుపుకుని ఉంది. మరి ఆ లిస్ట్ లో ఏ ఏ సినిమాలు ఉన్నాయంటే?
పుష్ప 2: ది రూల్ - రూ.617 కోట్లు
ఆర్ఆర్ఆర్ - రూ.451 కోట్లు
కల్కి 2898 ఏడీ - రూ.370 కోట్లు
బాహుబలి 2 - రూ.352 కోట్లు
సలార్ - రూ.345 కోట్లు
సాహో - రూ.270 కోట్లు
ఆది పురుష్ - రూ.240 కోట్లు
గేమ్ ఛేంజర్ - రూ.221 కోట్లు
రాధే శ్యామ్ - రూ.202.80 కోట్లు
సైరా నరసింహ రెడ్డి- రూ.187.25 కోట్లు
దేవర పార్ట్ 1 - రూ.182.55 కోట్లు
OG- రూ.172.50 కోట్లు
అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక బిజినెస్ జరుపుకున్న సినిమాల జాబితాలో ఓజీ మూవీ ఐదో స్థానం ఉంది. రూ.145 కోట్లు బిజినెస్ జరుపుకుని ఆ స్థానంలో నిలిచింది. అయితే ఆ లిస్ట్ లో కూడా పుష్ప-2 మూవీ రూ.213 కోట్లతో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ, సలార్ చిత్రాలు వరుసగా ఉన్నాయి.
