Begin typing your search above and press return to search.

OG ఈ ఛాన్స్ ఎవరికి రాదబ్బా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ రేపైనా సరే ఈరోజు రాత్రి 10 గంటల కి స్పెషల్ ప్రీమియర్స్ తో సినిమా రిలీజ్ అవుతున్నట్టే లెక్క.

By:  Ramesh Boddu   |   24 Sept 2025 9:48 AM IST
OG ఈ ఛాన్స్ ఎవరికి రాదబ్బా..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ రేపైనా సరే ఈరోజు రాత్రి 10 గంటల కి స్పెషల్ ప్రీమియర్స్ తో సినిమా రిలీజ్ అవుతున్నట్టే లెక్క. అంటే రిలీజ్ రేపైనా కొన్ని సెంటర్స్ లో ఈరోజు రాత్రి ఒక స్పెషల్ షో వేస్తున్నారు. ఆ టికెట్స్ కూడా ఆన్ లైన్ లో పెట్టారు. పవర్ స్టార్ రేంజ్ కి తగినట్టుగానే ఓజీ బుకింగ్స్ ఉన్నాయి. ఐతే ఓజీ సినిమా సోలో రిలీజ్ ఎంతో ప్లస్ అని చెప్పొచ్చు. ఓ పక్క దసరా కాబట్టి స్కూల్స్ కి హాలీడేస్ ఇచ్చారు. అంతేకాదు పోటీగా మరో సినిమా ఏది లేదు. అందుకే ఓజీ విధ్వంసం సృష్టిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది.

పవర్ స్టార్ లోని ఒకప్పటి ఎనర్జీ..

ఓజీ సినిమాను సుజిత్ చాలా స్టైలిష్ గా డిజైన్ చేశాడు. పవర్ స్టార్ లోని ఒకప్పటి ఎనర్జీ కనిపిస్తుంది. అంతేకాదు ఆయన వింటేజ్ లుక్ ని.. ఆ స్వాగ్ ని గుర్తుచేశాడు సుజిత్. అభిమాని కాబట్టి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించాలని డిసైడ్ అయ్యాడు. ఐతే ఓజీ సినిమాకు అన్నిచోట్ల బజ్ బాగుంది. సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఇది ఉంది అది లేదన్నది లేదు.. స్టైలిష్ యాక్షన్ గా ఓజాస్ గంభీరా మాస్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ ఇచ్చేలా ఉంది.

ఓజీ సినిమా విషయంలో థమన్ డబుల్ డ్యూటీ తెలిసిందే. ఫస్ట్ గ్లింప్స్ తోనే ఓజీ సినిమాను ఒక రేంజ్ లో లేపిన థమన్ ఓజీ సాంగ్స్, బిజిఎం కోసం చాలా కష్టపడ్డాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆమె రోల్ కూడా ఎమోషనల్ టచ్ ఉంటుందని అర్ధమవుతుంది. సాహోతోనే సుజిత్ మేకింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించాడు. ఇక ఇప్పుడు ఓజీతో దాన్ని వేరే లెవెల్ లో చూపించాలని ఫిక్స్ అయ్యాడు.

ట్రెండ్ ఫాలో అవ్వడు సెట్ చేస్తాడు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓజీ ఒక ఐ ఫీస్ట్ బొమ్మగా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా ప్రీ బుకింగ్స్ తోనే రికార్డులు అందుకోగా నెక్స్ట్ ఫస్ట్ డే భారీ టార్గెట్ ని పెట్టుకున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవ్వడు సెట్ చేస్తాడు. సో ఓజీ కచ్చితంగా మరోసారి పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చు.

ఓజీ సినిమా ఆన్ టైం షోస్ పడబోతున్నాయి. ఈ నైట్ కల్లా సినిమా టాక్ తెలుస్తుంది. సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం రేపటి నుంచి పవర్ స్టార్ సృష్టించే బాక్సాఫీస్ కలెక్షన్స్ మోత ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.