Begin typing your search above and press return to search.

ప్రీమియర్స్ రికార్డ్స్.. అమెరికాలో OG ర్యాంక్ ఎంత?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ ముందే మోత మోగించింది. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే యూఎస్ లో ఓజీ టికెట్లు హాట్‌కేక్స్‌లా అమ్ముడయ్యాయి

By:  M Prashanth   |   25 Sept 2025 11:19 AM IST
ప్రీమియర్స్ రికార్డ్స్.. అమెరికాలో OG ర్యాంక్ ఎంత?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ ముందే మోత మోగించింది. అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే యూఎస్ లో ఓజీ టికెట్లు హాట్‌కేక్స్‌లా అమ్ముడయ్యాయి. అభిమానుల్లో నెలల తరబడి ఎదురుచూడడంతో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే సేల్ అయిపోయాయి. ఈ క్రేజ్‌ వల్ల ఓజీ ప్రీమియర్స్‌కి భారీ స్థాయిలో హైప్ ఏర్పడింది. విడుదల రోజు రాకముందే ఓజీ ప్రీమియర్స్ కలెక్షన్లు ఒక సెన్సేషన్‌గా మారాయి.

మొదటి రోజు ఫ్యాన్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉండటంతో, నార్త్ అమెరికాలో ఓజీ మిలియన్ డాలర్ల వసూళ్లను జెట్ స్పీడ్‌లో అందుకుంది. చివరికి 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ రికార్డుల్లోనూ ఒక ప్రత్యేక ఘనత. ఇదే సమయంలో గతంలో కొన్ని పెద్ద సినిమాలు ప్రీమియర్స్‌లో సాధించిన రికార్డులు హైలెట్ అవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్, పుష్పా 2, దేవర, కల్కి వంటి సినిమాలు యూఎస్ లో భారీ వసూళ్లను సాధించాయి. వాటి జాబితాలో ఇప్పుడు ఓజీ నాలుగో స్థానంలో నిలిచింది. అమెరికా మార్కెట్‌లో ప్రీమియర్స్ హంగామా అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. రాజమౌళి ఆర్ఆర్ఆర్‌ ప్రీమియర్స్‌లోనే 3.5 మిలియన్ డాలర్ల గ్రాస్ అందుకుంది. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD 3.9 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉంది.

పుష్ప 2 కూడా 3.34 మిలియన్ డాలర్లతో రికార్డు సాధించింది. జూనియర్ ఎన్టీఆర్ దేవర 2.85 మిలియన్ డాలర్లతో బలమైన స్థానం సంపాదించింది. ఈ లైన్‌లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ కూడా చేరి మరో రికార్డ్ ని అందుకుంది.

నార్త్ అమెరికా ప్రీమియర్స్‌లో టాప్ 5 తెలుగు సినిమాలు

కల్కి 2898 AD - 3.9 మిలియన్ డాలర్లు

ఆర్ఆర్ఆర్ - 3.5 మిలియన్ డాలర్లు

పుష్పా 2 - 3.34 మిలియన్ డాలర్లు

ఓజీ - 3.0 మిలియన్ డాలర్లు

దేవర - 2.85 మిలియన్ డాలర్లు

ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ ఓజీ నాలుగో స్థానాన్ని అందుకోవడం విశేషం. ముఖ్యంగా ఇది రిలీజ్ రోజు ముందు సాధించిన వసూళ్లే కావడం మరింత ప్రత్యేకం. ప్రీమియర్స్ ద్వారా ఈ స్థాయి వసూళ్లు రావడం అంటే పవన్ మేనియాకే నిదర్శనం అని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. మొత్తం మీద ఓజీ ప్రీమియర్స్ కలెక్షన్లు పవన్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చాయి. థియేటర్లలో మాస్ రెస్పాన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ హంగామా, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు ఇవన్నీ కలిపి ఓజీని ఒక సూపర్ స్టార్ట్‌తో ముందుకు నెట్టాయి. ఇప్పుడు సినిమా కంటెంట్ ఈ అంచనాలను అందుకుంటే, ఓజీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.