OG అక్కడ నుంచే రికార్డులు స్టార్ట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ కు మరో 21 రోజులు ఉన్నా కూడా అప్పుడే రికార్డులు షురూ చేస్తుంది.
By: Ramesh Boddu | 4 Sept 2025 12:08 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ కు మరో 21 రోజులు ఉన్నా కూడా అప్పుడే రికార్డులు షురూ చేస్తుంది. ఓజీ సినిమా ఓవర్సీస్ లో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమా యూఎస్ లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రీ బుకింగ్స్ తోనే ఓజీ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. పవర్ స్టార్ మాస్ స్టామినా ఏంటో ఓజీ నార్త్ అమెరికా ప్రీ బుకింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు ప్రీ బుకింగ్స్ తో 1 మిలియన్ క్రాస్ చేసిన సినిమా లేదు. దాన్ని సుసాధ్యం చేసి ఇది పవర్ స్టార్ స్టామినా అంటే అని ప్రూవ్ చేశారు ఫ్యాన్స్.
ఓవర్సీస్ లో 3 వారాల ముందే రికార్డులు..
ఓవర్సీస్ లో తెలుగు సినిమాల మార్కెట్ కి గడ్డు కాలం నడుస్తుందన్న పరిస్థితి నుంచి మళ్లీ మన సినిమా అక్కడ కలెక్షన్స్ హంగామా చేసే రేంజ్ కి వెళ్లింది. ఓజీ సినిమా రిలీజ్ కు ఇంకా 3 వారాల ముందే ఇలా ఉంటే ఇక సినిమా రిలీజ్ టైం కు ఇంకెన్ని రికార్డులు షురూ చేస్తుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రికార్డులు అక్కడ నుంచే మొదలు పెట్టారు. ఓవర్సీస్ లోనే సినిమా మీద ఈ రేంజ్ బజ్ ఉంటే ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లో ఓజీ సృష్టించే సంచలనాలు ఒక రేంజ్ లో ఉంటాయని చెప్పొచ్చు.
సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఓజీ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో వస్తుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ స్వాగ్, స్టైల్ అన్ని కూడా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడం పక్కా అనిపుఇస్తుంది. ముఖ్యంగా రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తుంది. సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఓజీ సినిమా ఫస్ట్ డే కూడా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.
థమన్ మ్యూజిక్ పూనకాలు..
ఈ సినిమాకు థమన్ అందిస్తున్న మ్యూజిక్ కూడా వేరే లెవెల్ అనేలా ఉంది. ప్రమోషనల్ కంటెంట్ లోనే థమన్ మ్యూజిక్ పూనకాలు తెప్పించేస్తుంది. ఇక సినిమాలో అదరగొట్టేసి ఉంటాడని చెప్పొచ్చు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఓజీ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.
పవన్ కళ్యాణ్ జూలైలో హరి హర వీరమల్లుతో వచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. ఐతే ఓజీ సినిమా మాత్రం పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిస్తుందని అంటున్నారు. అదే జరిగితే మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ దసరాకి డబుల్ ధమాకా అన్నట్టే లెక్క. మరి సాహో సుజిత్ ఓజీ ని ఎలా తీశాడన్నది చూడాలి.
