OG ఈవెంట్.. మెగా చీఫ్ గెస్ట్..!
ఐతే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. విజయవాడలో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలనే ప్లానింగ్ ఉందట.
By: Ramesh Boddu | 11 Sept 2025 1:21 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఓజీ గ్లింప్స్ తోనే సినిమాపై హ్యూజ్ బజ్ ఏర్పడింది. ఐతే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. విజయవాడలో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాలనే ప్లానింగ్ ఉందట. దాదాపు అక్కడే ఈవెంట్ కన్ ఫర్మ్ అంటున్నారు. అంతేకాదు ఈ ఈవెంట్ కి స్పెషల్ చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని తీసుకొస్తున్నారట.
పవన్ ఇటు సినిమాలు అటు పాలిటిక్స్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి వస్తే అటు మెగా.. ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇద్దరికీ పండగ అన్నట్టే. అంతేకాదు అన్నదమ్ములు ఇద్దరు ఇలా ఫ్యాన్స్ ముందుకొచ్చి చాలా రోజులు అవుతుంది. పవన్ ఇటు సినిమాలు అటు పాలిటిక్స్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అటు ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ కూడా తన ఫ్రీ టైం లో కమిటైన సినిమాలు పూర్తి చేస్తున్నాడు.
ఓజీ సినిమా మొదలైన నాటి నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ దాని మీద గురి పెట్టుకున్నారు. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తోనే కేక పెట్టించారు. ముఖ్యంగా థమన్ ఇచ్చిన మ్యూజిక్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్ అయ్యాయి. సినిమా నుంచి వచ్చిన పవర్ స్టోర్మ్ సాంగ్ తో పాటు సువ్వి సువ్వి సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి.
ఒకే వేదిక మీద మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఓజీ మీద చాలా హోప్స్ తో ఉన్నారు. ఇక ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తే సినిమాపై ఉన్న అంచనాలు డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఓజీ ఈవెంట్ లో ఒకే వేదిక మీద చూడబోతున్నాం. ఓజీ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
కలకత్తా బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ కథతో ఓజీ వస్తుంది. సినిమాపై ఉన్న ఈ బజ్ కి తగినట్టుగా అవుట్ పుట్ ఉంటే మాత్రం పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యేలా కలెక్షన్స్ ఉంటాయని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఓజీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ గా ఉన్నారట. ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్లినా ఓజీ ఓజీ అనడం తో సినిమాతో మళ్లీ తన మాస్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నారు పవర్ స్టార్.
